Pegasas: తెరపైకి మరోసారి పెగాసస్.. బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ అంశంపై బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 11:05 AM IST
  • మరోసారి తెరపైకి పెగాసస్ అంశం
  • పెగాసస్‌ పై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
  • పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేశారు: మమతా
Pegasas: తెరపైకి మరోసారి పెగాసస్.. బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

CM Mamata Banerjee Sensational Comments on Pegasas: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని తెలిపారు. ఐదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను 25 కోట్లకు విక్రయిస్తామని దాని సృష్టికర్తలు బెంగాల్‌ పోలీసులను సంప్రదించారన్నారు. ఆ విషయం తనకు తెలియగానే వెంటనే తిరస్కరించానని చెప్పారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కోనుగోలు చేసిందన్నారు మమతా.

మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. గతేడాది ఈ అంశం దేశాన్ని ఊపేసింది. మోదీ ప్రభుత్వం ..దీనిని రహస్యంగా కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. పార్లమెంట్‌ను సైతం పెగాసస్‌ అంశం కుదిపేసంది. దీనిపై ఇప్పటికీ మోదీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. పార్లమెంట్‌లో పెగాసస్‌ అంశాన్ని కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. పెగాసస్‌ను భారత్‌ కొనుగోలు చేసిందని అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు సభ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. 

Also Read: India corona Update: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- మహమ్మారి కారణంగా 150 మంది మృతి!

Also Read: RRR Runtime: ఆర్‌ఆర్‌ఆర్‌ సెన్సార్‌ పూర్తి.. షాకింగ్ రన్‌టైమ్! బాహుబలి-2 కంటే ఎక్కువ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News