Bengali woman distributes leftover food in wedding: ప్రస్తుతం ఇండియాలో వెడ్డింగ్ సీజన్ (Wedding Season) నడుస్తోంది. మన దేశంలో పెళ్లిళ్లంటే నోరూరించే విందులు, బరాత్ డ్యాన్సులు, భారీ కానుకలు, బంధుమిత్రుల సందడి ఇవన్నీ గుర్తొస్తాయి. అదే సమయంలో టన్నుల కొద్ది ఆహార పదార్థాలు వృథాగా పోతుంటాయి. వాటిని వృథాగా పోనివ్వకుండా ఆకలితో బాధపడేవారికి ఇవ్వగలిగితే కనీసం ఒక పూట వారి కడుపు నింపవచ్చు. ఇందుకోసం పెద్దగా శ్రమించనక్కర్లేదు.. కాస్త మనసు పెడితే చాలు. తాజాగా కోల్‌కతాకి (Kolkata) చెందిన ఓ మహిళ తన సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టారు. అర్ధరాత్రి వేళ రిస్క్ అనుకోకుండా ఆమె చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఓరోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కోల్‌కతా (Kolkata) సబర్బన్ రైల్వే స్టేషన్‌ రాణాఘాట్‌కు ఆ మహిళ వచ్చారు. స్టీల్ బకెట్లలో కర్రీలు, బేసిన్ల నిండా అన్నం తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్లలో ఆకలితో ఉన్నవారిని పిలిచి పేపర్ ప్లేట్లలో అందరికీ కడుపు నిండా వడ్డించారు. అదే సమయంలో అక్కడ ఉన్న నీలాంజన్ మండల్ అనే ఫోటోగ్రాఫర్ ఆమె వారికి వడ్డిస్తుండగా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో (Social Media) అప్‌లోడ్ చేయడంతో నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె మంచి మనసును అభినందిస్తున్నారు.


సాంప్రదాయ దుస్తుల్లో రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కూర్చొని ఆ మహిళ అన్నం వడ్డిస్తుండటం (Distributing food) ఆ ఫోటోలో గమనించవచ్చు. ఆ మహిళ పేరు పాపియ కర్‌ అని ఫోటోగ్రాఫర్ నీలాంజన్ తెలిపాడు. సోదరుడి పెళ్లిలో ఆహార పదార్థాలు మిగిలిపోవడంతో.. ఇలా రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి పంచి పెడుతున్నట్లు చెప్పారని పేర్కొన్నాడు. ఆ ఫోటోపై (Viral News) ఓ నెటిజన్ స్పందించిన ఓ నెటిజన్.. 'ప్రజలు తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకే తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ కాలంలో... ఇలాంటి దయ గల మనుషులను చూసినప్పుడు మానవత్వంపై నమ్మకం కలుగుతుంది. ఆమె చేసిన పని చాలా గొప్పది. మనలో చాలామంది రోజూ ఆహారాన్ని వృథా చేస్తుంటారు... అది సిగ్గుపడాల్సిన విషయం...' అని పేర్కొన్నాడు.


Also Read: Pushpa Making Video: పుష్ప చిత్ర యూనిట్‌కు అల్లు అర్జున్ 'స్మాల్ రిక్వెస్ట్...'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook