Delhi Police Brutally hits Stray Dog: ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ అధికారి దుడ్డు కర్రతో వీధి కుక్కను చావబాదుతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతు సంరక్షణ కార్యకర్త ఒకరు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. పోలీస్ అధికారి తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అతనిపై చర్యలు తీసుకుంటామని జాఫ్రాబాద్ పోలీస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోలో సదరు పోలీస్ అధికారి లావు పాటి కర్రతో రోడ్డుపై ఉన్న కుక్కను దారుణంగా కొడుతుండటం గమనించవచ్చు. అతని క్రూరత్వానికి ఇక ఆ కుక్క అక్కడి నుంచి కదల్లేకపోయింది. ఆ కుక్క అతన్ని కరవడం వల్లే అతను దాడికి పాల్పడ్డాడని కొంతమంది చెబుతుండగా... అకారణంగా దాన్ని హింసించాడని జంతు సంరక్షణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆ పోలీస్ అధికారిని జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఏఎస్ఐగా గుర్తించారు.



కుక్కను ఆ ఏఎస్ఐ కర్రతో కొడుతున్న వీడియోను (Viral Video) హరీష్ అనే జంతు సంరక్షణ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాడిలో కుక్క కంటికి గాయమైందని... అది కదల్లేని స్థితిలో ఉందని పేర్కొన్నాడు. మరోవైపు, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. సదరు పోలీస్ అధికారిని జాఫ్రాబాద్‌ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే ఈ ఘటనపై పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


Also Read : Siddharth to Saina : సైనా నెహ్వాల్‌కు హీరో సిద్దార్థ్ బహిరంగ క్షమాపణలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook