ఇప్పుడిక మొబైల్ యూజర్లకు ఈసిమ్ లభించనుంది. వోడాఫోన్ త్వరలో ఈసిమ్ ను అందించనున్నట్టు ప్రకటించింది. తొలిదశలో కేవలం యాపిల్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం కలగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రముఖ మొబైల్ దిగ్గజమైన వోడాఫోన్ ఇండియా తన పోస్ట్ పెయిడ్ వినియోగదార్లకు కొత్త ఆఫర్ ను ప్రకటించింది. అదే ఈ సిమ్. తొలిదశలో యాపిల్ కస్టమర్లకు అందించిన తరువాత..రెండోదశలో శాంసంగ్ గాలెక్సీ జెడ్ ఫ్లిప్, శాంసంగ్ గాలెక్సీ ఫోల్డ్ స్మార్ట్ఫోన్లకు ఈసిమ్ సౌకర్యం కలగజేయనుంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈసిమ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఇతర నగరాలకు కూడా విస్తరించనుంది. Also read: Vaccine: దేశీయ వ్యాక్సిన్ ట్రయల్స్ కు 1125 శాంపిల్స్ సిద్ధం


ఇన్ స్టాల్ చేసుకునే విధానం:


వోడాఫోన్ కస్టమర్ 199 నెంబర్ కు ఎస్ ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. తరువాత e SIM ఈ మెయిల్ ఐడీను టైప్ చేయాలి. తరువాత ముందుగా SMS పంపించి...ఇన్ స్టాల్ ప్రక్రియను ప్రారంభించాలి. ఈ మెయిల్ సరిగ్గా నమోదైతే 199 నంబర్ నుంచి రిజిస్టర్ మొబైల్ కు SMS వస్తుంది. అనంతరం ఈసిమ్ ఆఫర్ నిర్ధారించడం కోసం కస్టమర్లు ఈసిమ్ వైతో వెరిఫై చేసుకోవాలి. ఆ తరువాత మరోసారి కస్టమర్ల విజ్ఞప్తిపై 199 నెంబర్ తో మరో SMS వస్తుంది. Also read: Assam Floods: వరద బీభత్సం, వేలాది గ్రామాలు నీట మునక


ఆ తరువాత రిజిస్టరైన ఈ మెయిల్ కు క్యూఆర్ కోడ్ వస్తుంది. కస్టమర్లు క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. ముందుగా తమ మొబైల్ ను వైఫై లేదా మొబైల్ డేటాకు కనెక్ట్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్ లో వెళ్లి...యాడ్ డేటా ప్లాన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సిమ్ ద్వారా విభిన్నమైన ప్రొఫైల్స్ ను వినియోగించుకునే సౌకర్యం కస్టమర్లకు కలుగుతుంది. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే