Vaccine: దేశీయ వ్యాక్సిన్ ట్రయల్స్ కు 1125 శాంపిల్స్ సిద్ధం

కోవిడ్ 19  వ్యాక్సిన్ ( Covid 19 Vaccine ) కు భారతదేశం పూర్తిగా ప్రయత్నిస్తోంది. దేశీయ కంపెనీతో కలిసి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( Pune- National institute of virology ) అభివృద్ధి చేసిన కో వ్యాక్జిన్ ( Covaxin ) క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండు ఫేజ్ ల క్లినికల్ ట్రయల్స్ కోసం 1125 శాంపిల్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.

Last Updated : Jul 20, 2020, 04:43 PM IST
Vaccine: దేశీయ వ్యాక్సిన్ ట్రయల్స్ కు 1125 శాంపిల్స్ సిద్ధం

కోవిడ్ 19  వ్యాక్సిన్ ( Covid 19 Vaccine ) కు భారతదేశం పూర్తిగా ప్రయత్నిస్తోంది. దేశీయ కంపెనీతో కలిసి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( Pune- National institute of virology ) అభివృద్ధి చేసిన కో వ్యాక్జిన్ ( Covaxin ) క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండు ఫేజ్ ల క్లినికల్ ట్రయల్స్ కోసం 1125 శాంపిల్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కంపెనీ ( Hyderabad-Bharat Biotech Company ), పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కో వ్యాక్జిన్ ( Covaxin ) పై దేశం చాలా ఆశలు పెట్టుకుంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమవడంతో ఇటీవలే డీసీజీఐ ( DCGI ) కీలకమైన క్లినికల్ ట్రయల్స్ ( Clinical Trials ) కు అనుమతిచ్చింది. ఇటీవలే క్లినికల్ ట్రయల్స్ తొలిదశ ప్రారంభమైంది. రెండు ఫేజ్ లలో జరపనున్న క్లినికల్ ట్రయల్స్ కోసం 1125 శాంపిల్స్ ను సిద్ధం చేసినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ( AIIMS Director Randeep Guleria ) స్పష్టం చేశారు.

18-55 ఏళ్ల లోపు ఆరోగ్యంగా ఉండి, ఎటువంటి వ్యాధులు లేనివారితో ఫేజ్ 1 వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. సిద్దం చేసిన 1125 శాంపిల్స్ లో 375 ఫేజ్ 1 కోసం, 750 ఫేజ్ 2 కోసం ప్రత్యేకించినట్టు ఆయన చెప్పారు. ఫేజ్ 2 ట్రయల్స్ ను 12-65 ఏళ్లలోపువారికి చేస్తామన్నారు. Also read: Assam Floods: వరద బీభత్సం, వేలాది గ్రామాలు నీట మునక

Trending News