బీజేపీ ఎమ్మెల్యే మరణంపై పశ్చిమ బెంగాల్  ( West Bengal ) లో రాజకీయ దుమారం రేగుతోంది. ఇంటి బయట ఉరి వేసుకుని  మరణించిన హేమ్తాబాద్ ఎమ్మెల్యేది ( Hemtabad Mla ) హత్యేనని బీజేపీ ( BJP ) ఆరోపించడం దీనికి ప్రధాన కారణం. తమ ఎమ్మెల్యే హత్య వెనుక టీఎంసీ హస్తముందని..సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారతీయ జనతా పార్టీకు ( Bharatiya janata party ) చెందిన పశ్చిమ బెంగాల్  హేమ్తాబాద్ ఎమ్మెల్యే దేబేంద్రనాధ్ రాయ్ ( MLA Debendra nath Roy ) నార్త్ దినాజ్‌పూర్ ( North Dinajpur ) లోని తన ఇంటి వెలుపల ఉరి వేసుకుని కన్పించారు. పోలీసులు ఆత్మహత్యగా  భావిస్తున్నా ఇది ముమ్మాటికీ హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. ముందు హత్యచేసి తరువాత ఉరి వేసినట్టు గ్రామస్థులు సైతం చెప్పారని బీజేపీ చెబుతోంది. ఈ మేరకు బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ ట్విీట్ కూడా చేసింది. ఉత్తర దినాజ్‌పూర్ లోని రిజర్వ్‌డ్ స్థానం నుంచి మృతుడు దేబేంద్రనాధ్ రాయ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2019లో దేబేంద్రనాధ్ బీజేపీలో చేరడమే అతను చేసిన నేరమా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ హత్య వెనుక తృణమూల్ కాంగ్రెస్ ( టీఎంసీ ) ( Trinamool Congress ) హస్తముందని...సీబీఐ దర్యాప్తు చేయించాలని బీజేపీ  డిమాండ్ చేస్తోంది. Also read: Rajasthan: సంక్షోభంలో గెహ్లాట్ ప్రభుత్వం


ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో వివిధ అంశాలపై బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తరచూ  ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. Also read: SBI జాబ్స్‌కు అప్లై చేశారా.. నేడు ఆఖరు తేదీ.. అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి