Bharata Ratna: భారతరత్న ప్రదానం చేయడానికి ప్రమాణాలు ఏమిటి? అవార్డు గ్రహీతలు ఎలాంటి సౌకర్యాలు పొందుతారు?
Bharata Ratna : భారత రత్న దేశంలోనే అత్యున్నత పురస్కారం. శనివారం ప్రధాని మోడీ ఎల్ కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీన్ని ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రదానం చేస్తారు. దేశ ప్రధాని దీన్ని ప్రకటిస్తారు. మెరిట్ ఆధారంగా ఇస్తారు. భారతరత్న అవార్డు పద్మ అవార్డులకు భిన్నంగా ఉంటుంది.
Bharata Ratna : భారత రత్న దేశంలోనే అత్యున్నత పురస్కారం. శనివారం ప్రధాని మోడీ ఎల్ కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీన్ని ఏడాదికి ముగ్గురికి మాత్రమే ప్రదానం చేస్తారు. దేశ ప్రధాని దీన్ని ప్రకటిస్తారు. మెరిట్ ఆధారంగా ఇస్తారు. భారతరత్న అవార్డు పద్మ అవార్డులకు భిన్నంగా ఉంటుంది.
మొదటిసారి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1954 జనవరి 2న ప్రారంభించారు. మహిళా సంక్షేమం, సైన్స్, కళలు, సాహిత్యం, రాజకీయాలు లేదా సామాజిక రంగాలకు కృషి చేసిన వ్యక్తులను ఈ గౌరవం ప్రధాన ఉద్దేశ్యం. ఇది ప్రతిష్టాత్మక పురస్కారం. దీనికి ఎటువంటి అధికారిక సిఫార్సు అవసరం లేదు.
భారతరత్న అవార్డు గ్రహీతలు ప్రభుత్వ న్యాయ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. భారతరత్న అవార్డు గ్రహీతలు సర్టిఫికేట్, మెడల్ అందుకుంటారు. కానీ డబ్బు ఇవ్వరు. దీనితో పాటు ఉచిత రైల్వే ప్రయాణం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తారు.
భారతరత్న ఎలా కనిపిస్తుంది?
భారతరత్న పతకం డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది రాగితో చేసిన రావిఆకు ఆకారాన్ని కలిగి ఉంటుంది. దానిపై మెరుస్తున్న సూర్యుడు ప్లాటినం డిజైన్ చేసి ఉంటుంది. ఈ మెడల్ పై హిందీలో వెండితో 'భారతరత్న' అని రాసి ఉంటుంది. పతకం వెనుక భాగంలో అశోక స్తంభం కింద 'సత్యమేవ జయతే' అని కూడా ఉంటుంది.
భారతరత్నకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ గౌరవం జీవితంలో లేదా మరణం తర్వాత ఇస్తారు. ఈ గౌరవం భారతీయులు కాని వారికి కూడా ఇవ్వవచ్చు. మదర్ థెరిసా, నెల్సన్ మండేలా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి అనేక మంది ప్రముఖులు కూడా గౌరవించారు.
ఇదీ చదవండి: Bharata Ratna to LK Adwani: L.k అద్వానీకి భారతరత్న.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..
ఇదీ చదవండి: Tirumala Tirupati Devasthanam: ఈ నెల తిరుమల వెళ్లేవారికి బిగ్అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook