Most Wanted Vikas Dubey: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబేను నేడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ( Vikas Dubey Arrested In Ujjain ) మహాకాళీ ఆలయం వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. గతవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్ ( Kanpur Encounter ) ఎనిమిది మంది పోలీసులను దుబే, అతని గ్యాంగ్ కాల్పులు జరిపి చంపింది. వికాస్ దుబే తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనం నెలకొంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Cm Yogi Adityanath ) వికాస్ దుబేను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. వికాస్ దుబే ఇంటికి పోలీసులు రానున్నారనే సమాచారాన్ని పోలీసు శాఖకు చెందిన వారే ముందుగా తెలియజేయడంతో దుబే పోలీసుల కోసం ట్రాప్‌ను ఏర్పాటు చేసి ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని హతమార్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. Also Read:Vikas Dubey Arrested: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే అరెస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెళ్లేలోగా..


అయితే దాదాపు వారం నుంచి వికాస్ దుబే కోసం ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గాలిస్తోండగా ఫరీదాబాద్‌లో శ్రీరామ్ హోటల్‌లో (Sriram Hotel Faridabad ) రూమ్ తీసుకుంటున్న విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా దుబే అక్కడి నుంచి పారిపోయాడు. అయితే సీసీటీవీలో మాత్రం దుబే చిత్రాలు ( Vikas Dubey On CCTV ) రికార్డు అయ్యాయి. అనంతరం అతను ఢిల్లీ, ఎన్సీఆర్‌లో ( Delhi NCR ) ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే నోయిడాలోని సెక్టార్ 71 (Noida 71 ) వద్ద అతన్ని ఆటోలో ప్రయాణిస్తూ చూశానని పోలీసులకు ఒక ప్రయాణికుడు తెలిపారు. దీంతో నోయిడాలో పోలీసులు పికెట్స్ ఏర్పాటు చేశారు. భారీగా సిబ్బందిని మొహరించారు. దుబే కనిపిస్తే..ఎదురు కాల్పులకు దిగితే స్పందించేలా ఏకే47 గన్నులతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. 


నోయిడాలో తిరగిన వార్తలో నిజమెంత ?


వికాస్ దుబే ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఉన్నారని అనుకుంటున్న తరుణంలో పోలీసులు అతన్ని మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. నోయిడాలో అతను కనిపించాడు అని ప్రయాణికుడు చెప్పిన సెక్టార్ 71 నుంచి అతను అరెస్ట్ అయిన ఉజ్జయినికి మధ్య దూరం 803 కిలోమీటర్లు. యూపీ పోలీసులు మొత్తం అతని గురించి వెతుకుతున్న సమయంలో వికాస్ దుబే అంత దూరం ఎలా వెళ్లగలిగాడు అనేది ప్రధాన ప్రశ్న. అతను నిజంగా నోయిడాలో తిరిగిన విషయం వాస్తవం ఎంత...అతను ఉజ్జయికి వెళ్లేందుకు ఎవరు సహకరించారు అనేది అరెస్ట్ అయిన దుబే ( Vikas Dubey Arrested ) చెప్పే అవకాశం ఉంది. అయితే  ఈ వార్తల్లో నిజమెంత (Truth About Vikas Dubey Arrest ) ఉంది. అసలు వికాస్ దుబే ఈ వారం మొత్తం ఎక్కడ తిరిగాడు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. Also Read : England Vs West Indies: ప్రేక్షకులు లేని టెస్టు మ్యాచు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


వికాస్ దుబే అరెస్ట్ అయ్యాడా లేక లొంగిపోయాడా ? అరెస్ట్‌కు ముందు  ఏం చేశాడు ?


వికాస్ దుబే ఉజ్జయిని ఆలయానికి కావాలనే వెళ్లాడని... దీని కోసం అతను రూ.250 ఎంట్రీ టికెట్ తీసుకొన్నాడని వార్తలు వస్తున్నాయి.సెక్యూరిటీ సిబ్బందికి తను వికాస్ దుబేను అని.. దర్శనం చేసుకున్నాక పోలీసులకు లొంగిపోతాను అని.. పోలీసులకు సమాచారం అందించమని తెలిపినట్టు కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ట్విటర్‌లో షేర్ చేశారు



అయితే ఉజ్జయిని ఆలయానికి వచ్చిన దుబేను సెక్యూరిటీ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అని.. దాంతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు దుబేను అరెస్ట్ చేసినట్టు విషయం మధ్య ప్రదేశ్‌లోని మహాకాళ్‌లో  పోలీసులు తెలిపారు. అతని అరెస్టు చేసిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.



 


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..