England Vs West Indies Test : కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా గత నాలుగు నెలలుగా ఎలాంటి క్రికెట్ మ్యాచులు జరగలేదు. కేవలం క్రికెట్ మాత్రమే కాదు క్రీడారంగం మొత్తం కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) సంక్రమణ వల్ల ప్రభావితం అయింది. అయితే నాలుగు నెలల క్రికెట్ ప్రేమికుల దిగులు మొత్తం నేటితో అంతం అయింది. జూలై 8న ఇంగ్లాండ్, వెస్టిండీస్ ( England Vs West Indies ) మధ్య టెస్టు క్రికెట్ మ్యాచు ప్రారంభం అయింది. Also Read : Covid-19 First Vaccine: కరోనావైరస్ తొలి వ్యాక్సిన్ ఇతనికే
West Indies vs England 2020: ఈ మ్యాచు ఎన్నో రకాలుగా ప్రత్యేకం. ఎందుకంటే కరోనావైరస్ వ్యాప్తి వల్ల క్రికెట్ నిబంధనలో కూడా ఎన్నో మార్పులు చేశారు.
Cricket Match Without Audience: ప్రేక్షకులు లేని టెస్టు మ్యాచు నియమాలు ఇవే..
1. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ టెస్టు మ్యాచు బయోబబుల్ (Bio-bubble) సృష్టించి నిర్వహిస్తున్నారు.
2.ఇందులో క్రికెట్ ( Cricket 2020 ) అభిమానులకు ప్రవేశం లేదు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, 143 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న తొలి మ్యాచు ఇది.
3. మ్యాచు ప్రారంభం అవ్వడానికి ముందే కొంత కాలం క్రితం ఆటగాళ్లకు బయటి ప్రపంచంతో లింక్ తెగిపోయింది. వారందరినీ సురక్షిత వాతావరణంలో ఉంచారు.
4. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బాల్‌పై ఆటగాళ్లు ఉమ్ము రుద్దడాన్ని ( No Spitting On Ball ) నిషేధించారు. పొరపాటును ఒక సారి చేస్తే అంపైర్లు క్షమిస్తారు. రెండోసారి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటారు.
5. డ్రింక్స్ బ్రేక్స్, టీ బ్రేక్, లంచ్ బ్రేక్‌లు కొనసాగుతాయి. Also Read: Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటీ ? ఆటగాళ్ల పూర్తిగా సురక్షితమా ?
6. గేమ్ మధ్యలో క్రికెటర్లు చేతులను శానిటైజ్( Cricket Field Sanitization) చేసుకోవాల్సి ఉంటుంది.
7. వారు వినియోగించే పరికరాలను నిత్యం శానిటైజ్ చేస్తుంటారు.
8. బాల్ బౌండరీ దాటి వెళ్తే తీసుకురావడానికి ఇంతకు ముందు బాల్‌బాయ్స్ ( Ball Boys) వేరేగా ఉండేవారు. ఇప్పుడు ఆటగాళ్లే బాల్‌బాయ్స్‌గా ఉంటారు.
9. క్రికెట్ మైదానం నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే లైవ్ ( Live Broadcasters ) అందించేవారు పీపీఈ కిట్స్ ధరిస్తారు.
10. ఇక అంపైర్ల ( England vs West Indies Unpires) విషయానికి వస్తే స్తానికులనే అంపైర్లుగా ఎంచుకుంటారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..