Martyrs Day: జాతిపిత మహాత్మా గాంధీ. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు. ఆ మహనీయుని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా..ఆ వివరాలు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్వజన హితం నా మతం...అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi Vardhanthi) మాటలివి. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు. 1948 జనవరి 30వ తేదీన బిర్లా హౌస్ వద్ద నిండా ద్వేషాన్ని నింపుకున్న నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ ఆ మహనీయుడు ప్రాణాలు విడిచాడు. ఇవాళ ఆ మహాత్ముడి 74వ వర్ధంతి. మహాత్ముడి వర్ధంతి రోజును దేశం మొత్తం షహీద్ దివస్‌గా జరుపుకుంటుంది. దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రక్షణ శాఖ మంత్రి అందరూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ (Rajghat) వద్ద నివాళులర్పిస్తారు.


రోజూ చేసే ప్రార్ధనల్నించి బయటకు వస్తుండగా నాథూరామ్ గాడ్సే(Nathuram Gadse) గాంధీని కాల్చి చంపాడు. జాతిపితగా కీర్తించిన గాంధీ ప్రాణాలర్పించిన రోజు కావడంతో మార్టిర్స్ డే (Martyrs Day) అంటే షహీద్ దివస్ జరుపుకుంటుంటాం. గాందీ చేసిన పోరాటం ప్రపంచమంతటినీ ఆకర్షించింది. కదిలించింది. దేశంలోని తెల్లదొరలతో పోరాడటంలో అహింసాయుత మార్గాన్ని అవలంభించిన మహాత్మునికి గుర్తుగానే షహీద్ దివస్ జరుపుకుంటూ వస్తున్నాం. గాందీ చేసిన పోరాటం ప్రపంచమంతటినీ ఆకర్షించింది. కదిలించింది. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమై నిలిచింది. అందుకే ఆ మహాత్మునికి గుర్తుగా..జ్ఞాపకంగా ఆయన వర్ధంతిని షహీద్ దివస్‌గా జరుపుకుంటూ వస్తున్నాం.


కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దేశం మొత్తం ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించాల్సి ఉంటుంది. దేశ స్వాతంత్ర్యం కోసం నాడు ప్రాణాలర్పించిన అందరి త్యాగానికి గుర్తుగా. కచ్చితంగా, అత్యంత గౌరవ శ్రద్ధలతో గాందీ వర్ధంతి రోజున షహీద్ దివస్ (Shahid Diwas) జరిగేలా కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి జారీ అయింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థల్లో సైతం షహీద్ దివస్ జరుపుకోవల్సి ఉంది. అదే సమయంలో స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లకు గుర్తుగా కూడా మార్చ్ 23న షహీద్ దివస్ జరుపుకుంటుంటాం.


Also read: India Corona Cases: దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు... భారీగా మరణాలు నమోదు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook