Covid19 Variant: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ప్రతి దేశంలోనూ వివిధ రకాల వేరియంట్ల వల్లనే పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఇండియాలో కరోనా పరిస్థితి తీవ్రంగా మారడానికి కారణం అదే వేరియంట్ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి దేశం కుదేలవుతోంది. జనం భయభ్రాంతులకు లోనవుతున్నారు. దేశంలో అతి వేగంగా వైరస్ విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరగడంతో దేశంలో ఆక్సిజన్, బెడ్స్, మందుల కొరత తీవ్రమైపోయింది. ఈ క్రమంలో ఓ వేరియంట్ కారణంగానే దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. ఇండియారో కరోనా ఉధృతికి కారణంగా అదేనంటున్నారు.


కరోనా వైరస్ లోని B.1.617 వేరియంట్(B 1.617 Variant) కారణంగానే ఇండియాలో కరోనా సంక్రమణ అత్యంత వేగంగా ఉందని ఆమె తెలిపారు. వాస్తవానికి ఈ వేరియంట్‌ను ఇండియాలో 2020 అక్టోబర్ నెలలోనే గుర్తించారు. ఓ ప్రత్యేకైన వేరియంట్‌గా డబ్ల్యూహెచ్‌వో‌(WHO) లిస్ట్ అవుట్ కూడా చేసింది.అయితే సహజ పద్ధతులు లేదా వ్యాక్సిన్ ద్వారా ఈ వేరియంట్‌ను తిప్పికొట్టే మ్యూటేషన్లు ఇందులో ఉన్నాయంటున్నారు. ప్రజలు బాధ్యతారహితంగా బయట తిరగడం, భౌతిక దూరం పాటించకపోవడం, నివారణ చర్యలు తీసుకోకపోవడమే కారణంగా సంక్రమణకు కారణమని సౌమ్య స్వామినాథన్ ( Soumya Swaminathan) చెప్పారు. 


Also read: India COVID-19 Cases: భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook