Janata Curfew సెగ.. రజనీకాంత్‌కు చేదు అనుభవం
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా రజనీకి చేదు అనుభవం ఎదురైంది.
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా రజనీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్‌లో కనిపించడం లేదు. ట్విట్టర్ రంగంలోకి దిగి రజనీ ట్వీట్‌ను తొలగించిందంటే నమ్ముతారా. కానీ అదే జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూను తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానికి మద్దతుగా రజనీకాంత్ వీడియో ట్వీట్ చేశారు.
హోమ్ క్వారంటైన్‌లో Belly Dance వీడియో వైరల్
‘భారత్‌లో కరోనా రెండో దశలో ఉంది. మూడో దశకు వెళ్లకూడదంటే సోషల్ డిస్టన్సింగ్ ఫాలో కావాలి. అలా చేస్తే 12 నుంచి 14 గంటల మధ్యలో కరోనా వైరస్ నశించిపోతుంది. ప్రజలు అందరూ బాధ్యతగా వ్యవహరించి జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి. కానీ ఇటలీలో చేసినట్లు చేయకూడదు. వాళ్లు సోషల్ డిస్టాన్సింగ్ సరిగ్గా పాటించనందుకు వేలాది మంది చనిపోతున్నారని’ రజనీ వీడియో ట్వీట్ పోస్ట్ చేశారు. కానీ ఆ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. Read also : కరోనాపై గర్భవతులకు శుభవార్త.. ఆ ఆందోళన అక్కర్లేదు
కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
నెటిజన్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ కారణంగానే ట్విట్టర్ రజనీ వీడియో పోస్ట్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రజలు 14 గంటలు ఇంట్లో కూర్చున్న కారణంగానే నిజంగా కరోనాను భారత్‌లొ లేకుండా చేయలేమని ట్విట్టర్‌కు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దీంతో అవాస్తవాలను ప్రచారం చేశారమోనన్న నెగటీవ్ ఫీడ్ బ్యాక్ కారణంగా పోస్ట్ ట్విట్టర్‌లో లేకుండా పోయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone