wife whatsapp status cyber crime: భార్య ఫోటో వాట్సప్ డీపీ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త!
wife whatsapp status cyber crime: భార్య ఫోటో వాట్సప్ స్టేటస్ గా పెట్టినందుకు ఆ వ్యక్తి ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సివస్తోంది.
wife whatsapp status cyber crime: మీ భార్యంటే మీకు అతిప్రేమా.. మీ ప్రేమను చూయించడానికి ఆమె ఫోటోనే వాట్సప్ డీపీగా పెడుతున్నారా. లేదంటే ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్, కవర్ పిక్చర్‌లోగానీ ఆమె ఫోటో ఉంచుతున్నారా... అయితే జాగ్రత్త. సైబర్ నేరస్తులు ఆ ఫోటోలతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిరావొచ్చు. చెన్నైలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం
చెన్నై అయ్యన్నవరం లో నివసించే ఓ వ్యక్తిని ఇటీవల సైబర్ నేరగాళ్లు వేధిస్తున్నారు. ఆయన భార్య నగ్నఫోటోను పంపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అడిగినంత డబ్బివ్వకుంటే ఆఫోటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ వేధింపులు భరించేక ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సైబర్ నేరగాళ్ల వేధింపుల గురించి వివరించాడు. వెంటనే స్పందించిన పోలీసులు కేసును సైబర్ వింగ్ కు బదిలీచేశారు. అసలు నేరగాళ్లకు ఫోటో ఎలా దొరికిందని ఆరా తీశారు. అందులో అసలు విషయం తెలిసి షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తి వాట్సప్ డీపీగా పెట్టుకున్న ఫోటోనే సైబర్ నేరగాళ్లు మార్పింగ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం వారి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
నిజానికి వాట్సప్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. డీపీలు, స్టేటస్‌లు ఎంచుకున్నవారికి మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అయితే చాలా మందికి ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోరు. దీన్నే సైబర్ నేరస్తులు అవకాశంగా తీసుకుంటున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి వాట్సప్ డీపీల్లో తమకు పనికొచ్చే ఫోటో ఉంటే తీసుకొని మార్ఫింగ్ చేస్తున్నారు. తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు. మనం చేస్తున్న చిన్న తప్పు పెద్ద సమస్యలకు కారణమవుతోంది. అందుకే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు.
Also read:Shah Rukh Khan: మండుతున్న ఎండలు, షారుక్ కు సరదా ట్వీట్..!!
Also read: Long Life: మీరు నూరేళ్లు బతకాలంటే... మీ ఆహారంలో ఈ చిన్న మార్పులు చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.