How to Prevent Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా సైబర్ నేరాలు జరిగే తీరుపై అవగాహన కల్పిస్తూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే సైబర్ దోస్త్ ( @cyberdost ) పేరిట ట్విటర్‌లో ఓ ఖాతా తెరిచిన కేంద్ర హోంశాఖ.. ఆ పేరుతో ఫోటోలు, షార్ట్ వీడియోలు, క్రియోటివ్స్ రూపంలో 1066 సైబర్ సేఫ్టీ టిప్స్ పోస్ట్ చేసి జనంలో చైతన్యం నింపింది. ట్విటర్‌లో సైబర్ దోస్త్ ఖాతాను 3.64 లక్షల మంది ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు.
- రేడియో ప్రసారాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
- దేశ పౌరులకు 100 కోట్లకుపైగా ఎస్ఎంఎస్‌లు సైతం పంపించి వారిలో సైబర్ భద్రతపై అవగాహనకు కృషిచేశారు.
- ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ నేరాలపై జనంలో అవగాహన కల్పిస్తూ వారిని సైబర్ మోసాల బారినపడకుండా కృషి చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది.
Twitter - https://twitter.com/Cyberdost
Facebook - https://www.facebook.com/CyberDost/4C
Instagram - https://www.instagram.com/cyberdosti4c
Telegram - https://t.me/cyberdosti4c
- మై గవర్నమెంట్ అనే వెబ్ పోర్టల్ తో పాటు మొబైల్ యాప్ ద్వారా సైతం సైబర్ నేరాల నియంత్రణకు కేంద్రం కృషి చేస్తోంది.
- పెద్దలు, యువత, విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి అవగాహన పెంపొందిస్తూ బుక్స్ కూడా పబ్లిష్ చేసి జనానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
- ప్రభుత్వ అధికారులకు సైబర్ భద్రత గురించి తెలిసొచ్చేలా ఇన్‌ఫర్మేషన్ సెక్యురిటీ బెస్ట్ ప్రాక్టిసెస్‌పైనా పలు పుస్తకాలు ప్రచురించడం గమనార్హం.
- వివిధ రాష్ట్రాల్లో స్థానిక పోలీసు శాఖల సమన్వయంతో సైబర్ భద్రతపై వారోత్సవాలు నిర్వహించి వారిలో అవగాహన పెంపొందించేందుకు కేంద్రం కృషిచేసింది.
- అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, వివిధ ప్రభుత్వ విభాగాలతో సైబర్ నేరాల అదుపునకు 148 సలహాలు, సూచనలు చేసింది.
- ఎప్పటికప్పుడు రాబోయే ముప్పును నివారించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ వస్తోంది.
- దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం భారీ సంఖ్యలో పౌరులకు సేవలు అందిస్తున్న ఢిల్లీ మెట్రో ద్వారా కూడా అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల నియంత్రణకు (Cyber crimes) కేంద్రం కృషిచేస్తోంది.
- ''సైబర్ హైజీన్ ఫర్ సైబర్ స్పేస్ - డూస్ అండ్ డోంట్స్'' పేరిట ఇంటర్నెట్ సేఫ్టీ, ఈమెయిల్, మొబైల్ సేఫ్టీ వంటి అంశాలపైనా కేంద్రం అవగాహన చేపట్టింది.
- ప్రతీ నెలలో తొలి బుధవారం సైబర్ జాగ్రూకతా దివాస్ పేరిట ఉదయం 11 గంటలకు సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారీ అవగాహనా సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. విద్యా సంస్థలు, కళాశాలల్లోనూ విద్యార్థుల్లో సైబర్ నేరాలను నిరోధించేలా అవగాహన పెంపొందించాల్సిందిగా సూచించడంతో పాటు ఈ దిశగా ఓ వార్షిక ప్రణాళికను సైతం రూపొందించాల్సిందిగా కేంద్రం నిర్దేశించింది. 2021 అక్టోబర్ 6వ తేదీ నుంచే కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
- 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు అందరికీ సైబర్ నేరాల నియంత్రణ దిశగా అవగాహన పెంపొందించుకునేలా పాఠ్యాంశాలు రూపొందించాలని కేంద్ర విద్యా శాఖ స్పష్టంచేసింది.
Also read : Whatsapp Tricks: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా.. ఈ ట్రిక్‌తో మీకు మీరే ఇలా అన్‌బ్లాక్ చేసుకోండి
Also read : Charging Tips: మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఈ టిప్స్ పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook