ఆయనో ముఖ్యమంత్రి..ఒక మహిళ తన వద్దకు ఒక సమస్య తీసుకెళ్తే.. సీఎం విచారణ చేస్తానులే.. మూడు నాలుగు నెలలు ఉద్యోగానికి సెలవుపెట్టి ప్రశాంతంగా ఉండు అని సూచించాడు. ఆయనెవరో కాదు.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివారాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు, అరాచకాలు ఈ మధ్య ఎక్కువగానే జరుగుతున్నాయి. వీటి మీద ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఒక మహిళా కానిస్టేబుల్ తనపై అడిషనల్ ఎస్పీ రాజేంద్ర వర్మ లైంగికంగా వేధించినట్లు సీఎం కు ఫిర్యాదు చేసింది. తాను ఈ లైంగిక వేధింపుల వల్ల మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అధికారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ను కోరింది.


ముఖ్యమంత్రి తన బాధను అర్థంచేసుకొని సదురు అధికారిపై  తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఆ మహిళా కానిస్టేబుల్ తెలిపారు. తనను మూడు నాలుగు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతి తీసుకొమని చౌహాన్ చెప్పారని ఆమె మీడియాకు తెలిపారు.