Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... మరో కశ్మీర్ పండిట్ హత్య...
Kashmir Pandit Shot Dead Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ఓ మహిళా కశ్మీర్ పండిట్‌ను హత్య చేశారు. ఓ స్కూల్ సమీపంలో ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు.
Kashmir Pandit Shot Dead Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దురాఘతాలు కొనసాగుతున్నాయి. తాజాగా కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొరాలో ఓ కశ్మీరీ పండిట్ మహిళను ఉగ్రవాదులు కాల్చి చంపారు. స్థానికంగా ఉన్న ఓ హైస్కూల్ సమీపంలో ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని సాంబా జిల్లాకు చెందిన రజనీగా గుర్తించారు. ఈ మేరకు కశ్మీర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వలస వచ్చిన మరో ప్రభుత్వ టీచర్‌పై జరిగిన ఈ దాడి కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని జరిగిందేనని పేర్కొన్నారు. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రదాడులపై ఖండనలు, మృతులకు సంతాపాలు జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తామని ప్రభుత్వం చెప్పిన హామీల లాగే తయారయ్యాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల హింస కారణంగా మరో కుటుంబానికి తీరని నష్టం జరిగిందన్నారు.
గత బుధవారం (మే 25) బుద్గాం జిల్లాకి చెందిన ఓ టీవీ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకుముందు, అదే బుద్గాం జిల్లాలోని చదూరా ప్రాంతంలో రాహుల్ భట్ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్యపై కశ్మీరీ పండిట్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమవుతోందని నిరసనకారులు ఆరోపించారు. తాజాగా మరో కశ్మీరీ పండిట్ హత్యకు గురవడంతో పండిట్ల నుంచి మరోసారి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
Also Read: Revanth Reddy: అమెరికాలో రేవంత్... హైదరాబాద్ లో భట్టీ మీటింగ్! కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Also Read: Rains in Telangana: వాతావరణ శాఖ హెచ్చరిక... నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook