Rains in Telangana: వాతావరణ శాఖ హెచ్చరిక... నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 09:57 AM IST
  • తెలంగాణ వెదర్ అప్‌డేట్స్
  • రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
  • జూన్ 4 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు
Rains in Telangana: వాతావరణ శాఖ హెచ్చరిక... నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

Rains in Telangana: తెలంగాణలో నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధ (మే 31, జూన్ 1) వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరిక జారీ చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆది, సోమవారాల్లో వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని పేర్కొంది.

కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు 3.1 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని... దీని ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన ఉందని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. చాలాచోట్ల మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లబడింది.

సోమవారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మల్‌చెల్మలో 3.3 సెం.మీ, ఖమ్మం జిల్లా కొణిజర్లలో 3.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోల్‌బెల్ట్ ప్రాంతమైన రామగుండంలో పగటిపూట 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

 

Also Read: India Covid-19 Update: దేశంలో తగ్గుతున్న కొవిడ్ కేసులు...500 రోజులు పూర్తి చేసుకున్న టీకా పంపిణీ!  

Also Read: Prabhas Maruti Movie: ప్రభాస్‌-మారుతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News