Covid-19 Patient: కోవిడ్-19 పేటెంట్తో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ( Uttar Pradesh) నోయిడాలో చోటు చేసుకుంది. స్థానిక జేపీ ఆసుపత్రిలో ( JP Hospital ) కరోనావైరస్ ( Coronavirus ) సోకిన ఒక యువతి చికిత్స అందుకుంటోంది. అదే ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్న మరో వైద్యుడు ఆమెతో అసభ్యంగా  ప్రవర్తించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also: APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో కరోనా కలకలం


సదరు మహిళ ఢిల్లీ విశ్వ విద్యాలయానికి ( Delhi University Student ) చెందిన విద్యార్థిని అని తన కంప్లైంట్ లో తెలిపింది. తను అడ్మిట్ అయిన సోలేష్ వార్డులో  (Isolation Ward ) ఉన్న 35 సంవత్సరాల డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ వైద్యుడు చికిత్సలో ఉన్నాడు అని కోవిడ్-19 టెస్టులో నెగెటివ్ అని తేలితే అతన్ని అదుపులో తీసుకుంటాం అని పోలీసులు తెలిపారు. ఇప్పటికైతే నిందితుడిని మరో వార్డుకు తరలించినట్లు పోలీసులు వివరించారు.


Read This Story Also: Dhanush Birthday: సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ సందడి