Lok Sabha Passes Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. లోక్ సభలో నారి శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా భారీ మెజార్టీ లభించింది. ఈ బిల్లుకు 454 మంది లోక్ సభ సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఈ బిల్లులోని అంశాలను వ్యతిరేకిస్తూ వ్యతిరేక ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు గురువారం రాజ్య సభలో చర్చకొచ్చే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతు, జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మహిళలకు పోటీ చేసే అవకాశాన్ని అందిస్తుంది అని అన్నారు. రాజ్య సభలో నారి శక్తి వందన్ అధినియం ఆమోదం పొందినట్టయితే.. ఆ తరువాత బిల్లు ఫైల్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల తరువాత జనాభా లెక్కింపు, డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలులోకి తీసుకొస్తాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే జనాభా గణన చేపట్టి, డిలిటేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేస్తామని అమిత్ షా తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే.. పార్లమెంట్ లో మహిళలకు తమ గళం వినిపించే అవకాశం లభిస్తుంది అని అమిత్ షా వ్యాఖ్యానించారు. 


సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును నిన్న మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టగా నేడు బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుని ఎన్నికల తరువాత వరకు ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాల్సిందిగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అలాగే ఇదే బిల్లులో ఓబిసి రిజర్వేషన్ సైతం అమలుపర్చాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బిల్లుపై చర్చ అనంతరం మెజారిటీ సభ్యులు తమ ఆమోదం తెలిపారు. 


ఇది కూడా చదవండి : Selling Your Used Car: మీ పాత కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా ?


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మూడో రోజు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగ్గా.. మరోవైపు రాజ్య సభలో చంద్రయాన్ -3 విజయంపై చర్చిస్తూ ఇస్రో సాధించిన ఈ ఘన విజయంపై ప్రశంసల వర్షం కురిపించారు.


ఇది కూడా చదవండి : Women's Reservation Bill: పార్లమెంట్‌ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఏ రాష్ట్రంలో ఎంత మంది మహిళా సభ్యులు ఉన్నారంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి