Parliament Special Session: చారిత్రాత్మక పాత పార్లమెంట్‌లో ఇవాళ చివరి సమావేశం కానుంది. రేపట్నించి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించే అంశాలే ఇప్పుడు ఆసక్తి కల్గిస్తున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో స్పష్టత లేకపోయినా ఈ సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవాళ్టి నుంచి ఐదురోజుల పాటు అంటే సెప్టెంబర్ 22 వరకూ పార్లమెంట్ సెషన్ జరగనుంది. చారిత్రక పాత పార్లమెంట్‌లో ఇవాళ చివరి సమావేశముంటుంది. రేపు వినాయక చవితి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవననంలో సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో 75 ఏళ్ల పార్లమెంట్ చరిత్రపై, ప్రస్థానంపై చర్చ ఉంటుంది. గతంలో అనుభవాలు, విజయాలు, జ్ఞాపకాలు అన్ని అంశాల ప్రస్తావన ఉంటుంది. పాత పార్లమెంట్‌లో జరిగిన చారిత్రక ఘట్టాల గురించి వివరణ ఉంటుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఆమోదం పొందిన అడ్వకేట్ల సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు రానున్నాయి. అదే విధంగా పోస్ట్ ఆపీసు బిల్లు 2023, ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర కమీషనర్ల నియామక బిల్లు 2023పై చర్చ జరగనుంది. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
ఇక ఈ సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చడం, వన్ నేషన్-వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌరస్మృతి బిల్లుల్ని ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించకపోడవంతో సందిగ్దత నెలకొంది. ఈ బిల్లుల్ని మోదీ ప్రభుత్వం హఠాత్తుగా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని, లేకపోతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరమేముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Also read: Rajinikanth: చంద్రబాబుని రజినీకాంత్ ఎందుకు కలవలేదంటే, కారణమిదేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook