Women's Reservation Bill: పార్లమెంట్‌ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఏ రాష్ట్రంలో ఎంత మంది మహిళా సభ్యులు ఉన్నారంటే..?

Women's Reservation Bill Latest Updates: మహిళా రిజర్వేషన్ బిల్లు నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఉభయ సభల్లో ఆమోదం తరువాత చట్టంగా మారుతుంది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎంత మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 19, 2023, 01:31 PM IST
Women's Reservation Bill: పార్లమెంట్‌ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఏ రాష్ట్రంలో ఎంత మంది మహిళా సభ్యులు ఉన్నారంటే..?

Women's Reservation Bill Latest Updates: మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు మళ్లీ తెరపైకి వచ్చింది. సోమవారం రాత్రి కేంద్ర ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో నేడు లోక్‌సభ ముందుకు రానుంది. దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు మరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుండడంతో మహిళల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో పలుమార్లు ఉభయ సభల ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా.. ఆమోదం పొందలేకపోయింది. ఈసారి ఉభయసభల్లో బిల్లు పాస్ అయితే.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలు, రాజ్యసభలు, లోక్‌సభల్లో మహిళల ప్రాతినిధ్యం 15 శాతంలోపే ఉంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మొత్తం 543 మంది లోక్‌సభలో 78 మంది మహిళలు ఉన్నారు. ఇది 14.4 శాతం. రాజ్యసభలో 24 మంది మహిళా ఎంపీలు అంటే 14 శాతం మంది ఉన్నారు. అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో 10 శాతం కంటే తక్కువ మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి. త్రిపురలో 15 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 14.44 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 13.7 శాతం, జార్ఖండ్‌లో 12.35 శాతం మహిళా రిజర్వేషన్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో 10-12 శాతం మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర మరియు పుదుచ్చేరిలలో 10 శాతం కంటే తక్కువ మహిళా ప్రాతినిధ్యం ఉంది.

రాష్ట్ర అసెంబ్లీలలో మహిళా ప్రాతినిధ్యం ఇలా..

త్రిపుర: 15 శాతం, ఛత్తీస్‌గఢ్: 14.44 శాతం, పశ్చిమ బెంగాల్: 13.70 శాతం, జార్ఖండ్: 12.35 శాతం, రాజస్థాన్: 12, ఉత్తరప్రదేశ్: 11.66 శాతం, ఢిల్లీ NCT: 11.43 శాతం, ఉత్తరాఖండ్: 11.43 శాతం, పంజాబ్: 11.11 శాతం, గుజరాత్: 10.79 శాతం, బీహార్: 10.70 శాతం, హర్యానా: 10 శాతం, సిక్కిం: 9.38 శాతం, మధ్యప్రదేశ్: 9.13 శాతం, ఒడిశా: 8.9, మహారాష్ట్ర: 8.33 శాతం, మణిపూర్: 8.33 శాతం, ఆంధ్రప్రదేశ్: 8.00 శాతం, మణిపూర్: 8 శాతం, కేరళ: 7.86 శాతం, గోవా: 7.50 శాతం, తమిళనాడు: 5.13 శాతం, తెలంగాణ: 5.04 శాతం, అరుణాచల్ ప్రదేశ్: 5 శాతం, మేఘాలయ: 5 శాతం, అస్సాం: 4.76 శాతం, కర్ణాటక: 4.46 శాతం, నాగాలాండ్: 3.33 శాతం, పుదుచ్చేరి: 3.33 శాతం, జమ్మూ కాశ్మీర్: 2.30 శాతం, హిమాచల్ ప్రదేశ్: 1.47 శాతం, మిజోరం: 0 శాతం.

Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!  

Also Read: New Parliament: కొత్త పార్లమెంట్ భవనానికి పేరు ఇదే, భారత్ పేరు మార్పిడి అంతా పుకారేన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News