Ramdev Baba: అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం వివాదం ముదురుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైన యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి ఐఎంఏకు సవాల్ విసిరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి, చికిత్స నేపధ్యంలో దేశంలో ఆయుర్వేదం(Ayurvedam) వర్సెస్ అల్లోపతి (Allopathy) వివాదం రాజుకుంది. యోగా గురువు రాందేవ్ బాబా(Ramdev Baba) చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి. ఫలితంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు రాందేవ్ బాబాకు ప్రత్యక్ష యుద్ధం జరుగుతోంది. రాందేవ్ బాబా 15 రోజుల్లోగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని..లేకపోతే వేయి కోట్ల దావా వేస్తామని ఉత్తరాఖండ్ ఐఎంఏ నోటీసులు పంపింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రదాని మోదీకు లేఖ రాసింది. దీనికి సమాధానంగా తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదని సవాలు విసిరారు. 


ఇప్పుడు తాజాగా యోగా గురువు రాందేవ్ బాబా ఐఎంఏకు (IMA)మరో సవాలు విసిరారు. 2012లో అమీర్ ఖాన్ (Aamir khan)నిర్వహించిన సత్యమేవ జయతే టాక్ షో వీడియోను షేర్ చేస్తూ..దేశంలో మెడికల్ మాఫియాపై వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్‌పై కేసు పెట్టగలరా అంటూ ఛాలెంజ్ చేశారు. మెడికల్ మాఫియా, ఇష్టారాజ్యంగా పెంచేస్తున్న మందుల ధరలపై ఆ షోలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసు పెట్టగలరా అని సవాల్ విసిరారు. అమీర్ ఖాన్‌ను ఈ విషయంలో నిలదీయగలరా అని ఛాలెంజ్ చేశారు. 


Also read: Private Hospitals: కరోనా బాధితులకు పది లక్షలు తిరిగి చెల్లించాలంటూ ఆ ఆసుపత్రికి ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook