Ramdev Baba: నేను తీవ్రంగా చింతిస్తున్నా అంటూ.. మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణలు!
Ramdev Baba regrets and apologises to Womens. మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబా దిగొచ్చారు. మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పారు.
Yoga guru Ramdev Baba says Apologises to Women over controversial comments on womens clothing: ఎట్టకేళకు యోగా గురువు రాందేవ్ బాబా దిగొచ్చారు. మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా క్షమాపణ లేఖ నేడు విడుదల చేశారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే తనను క్షమించాలని ఆయన కోరారు.
గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి కలిసి యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. మహారాష్ట్ర డెప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ఫడణవీస్ సహా పలువురు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన అనంతరం ఓ సమావేశం జరిగింది. సమయం లేకపోవడంతో ఆ సమావేశంకు కొందరు మహిళలు యోగా దుస్తుల్లోనే హాజరయ్యారు. అది చుసిన రామ్‌దేవ్.. 'స్త్రీలు చీరల్లో, సల్వార్ సూట్‌లలో అందంగా ఉంటారు. నాలాగా అసలేం ధరించకపోయినా బాగుంటారు'అని నోరు జారారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
సోషల్ మీడియాలో యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురిసింది. రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విటర్‌లో వెల్లడించారు. రాందేవ్ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు.
'మహిళలు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలని వారి సాధికారత కోసం నేను ఎప్పుడూకృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంను నేను ప్రోత్సహిస్తా. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ వాస్తవం కాదు. అయినా కూడా ఎవరైనా బాధపడితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు చెపుతున్నా' అని రాందేవ్ బాబా పేర్కొన్నారు.
Also Read: యువ హీరోయిన్‌తో భారత క్రికెటర్ డేటింగ్.. మొత్తానికి అలా దొరికిపోయారు! న్యూజిలాండ్ పర్యటనలో బిజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.