దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో 'అయోధ్య దీపోత్సవ్ 2018' పేరిట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సరయు నది తీరాన 3,01,152 దీపాలు వెలిగించినందుకుగాను అయోధ్య దీపోత్సవ్ 2018 ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఉత్సవంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు కీలకమైన ప్రకటనలు చేశారు. ఫైజాబాద్‌ జిల్లాను ఇకపై అయోధ్య జిల్లాగా పిలవనున్నట్టు యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా ఓ ప్రకటించారు. శ్రీరాముడితో ముడిపడి ఉన్న ఈ పవిత్రమైన ప్రాంతానికి మరే ఇతర పేరు కూడా సరిపోదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యోగి ఆదిత్యనాథ్ స్పష్టంచేశారు. అంతేకాకుండా త్వరలోనే అయోధ్యలో శ్రీరాముడి పేరుతో విమానాశ్రయం నిర్మించనున్నట్టు తెలిపారు.


గతంలోనే ఫైజాబాద్ పేరును మార్చాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.