Kerala Shocking Incident:  వారం రోజులుగా తిండీతిప్పలు లేక ఓ యువకుడు అలమటించిపోయాడు. పట్టెడన్నం లభించక దుర్భర జీవితాన్ని ఎదుర్కొన్నాడు. ఇక ఆకలికి తాళలేక ఒక చోట పడి ఉన్న చనిపోయిన పిల్లి కళేబరాన్ని తిన్నాడు. ఇది చూసిన స్థానికులు నివ్వెరపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పిల్లి మాంసం తిన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘోర సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Facebook Anniversary: 'ఫేస్‌బుక్‌'కు 20 వసంతాలు.. సామాజిక దిగ్గజ చరిత్ర తెలుసా..?


అస్సాంలోని ధుబరి జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడు స్వరాష్ట్రంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ గతేడాది డిసెంబర్‌లో కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా రైలు ఎక్కి కేరళకు చేరుకున్నాడు. అప్పటి నుంచి కేరళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో ఐదు రోజులుగా తిండి తినలేకపోయాడు. కేరళలోని మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండ్‌కు ఉంటున్నాడు. తిండి లేక అల్లాడిపోతున్న ఆ యువకుడు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో బస్టాండ్‌ సమీపంలో చనిపోయిన పిల్లి కనిపించింది. ఆకలికి తట్టుకోలేక వెంటనే అక్కడికి వెళ్లి పిల్లిని పచ్చిగా అలానే తినేశాడు.

Also Read: UBI Recruitment: అదిరిపోయే ఉద్యోగం.. ఈ జాబ్‌కు ఎంపికైతే తొలి జీతమే రూ.90 వేలు


ఇది చూసిన అక్కడి స్థానికులు నివ్వెరపోయారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీయగా.. తన దీన పరిస్థితిని వివరించాడు. ఇది విన్న పోలీసులు చలించిపోయారు. వెంటనే భోజనం పార్సిల్‌ తెప్పించి ఇచ్చారు. ఆహారం దొరకడంతో అతడు గబగబా తినేశాడు. అనంతరం నీళ్లు తాగి తన వివరాలు పోలీసులకు చెప్పాడు. ఈ విషయమై కుట్టిపురం ఇన్‌స్పెక్టర్‌ పీకే పద్మరాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'చెన్నైలో ఉన్న సోదరుడి వద్దకు వెళ్లేందుకు అతడు కోజికోడ్‌కు వచ్చాడు. అక్కడి నుంచి అతడు అదృశ్యమయ్యాడు. అతడి పరిస్థితిని గమనించి కోజికోడ్‌ మానసిక ఆస్పత్రికి తరలించాం' అని తెలిపారు. 


ఈ సంఘటన దేశ ప్రజలను నివ్వేరపరిచింది. దేశంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవడం దారుణంగా పేర్కొంటున్నారు. ఈ సంఘటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమృత కాల ఉత్సవాలు చేసుకుంటున్న భారతదేశంలో ఇంకా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. 'ఇంట్లో పారిపోయి వచ్చిన అతడు ఎలాగైనా ఆహారం పొందవచ్చు. పిల్లిని తినేంత పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాల్సి ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగాలేదేమో' అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి