కర్ణాటక ఎన్నికలను పురస్కరించుకొని ఓట్ల శాతాన్ని పెంచడం కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమాలు అన్ని ఒక ఎత్తైతే.. అదే రాష్ట్రంలో ఓ హోటల్ యజమాని ఓ వినూత్న పద్ధతికి నాంది పలికిన విధానం ఒక ఎత్తు. ఓటు హక్కు వినియోగించుకొనే యువతకు ఆయన ఒక ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటు వేసి తన హోటల్‌కు వచ్చే  యువతీ యువకులు ఓ దోశను ఉచితంగా తినవచ్చని ఆయన అంటున్నారు. అయితే ఈ ఆఫర్ యూత్‌కు మాత్రమేనా.. తమకు లేదా అని నొచ్చుకొనే పెద్దవారికి కూడా అదే హోటల్‌లో మరో ఆఫర్ ప్రకటించారు. ఓటు హక్కు వినియోగించుకొనే ఎవరైనా వచ్చి ఆ హోటల్‌లో ఆ రోజు ఫిల్టర్ కాఫీ ఉచితంగా తాగవచ్చంట. అయితే ఉచితంగా దోశ లేదా కాఫీ పొందాలనుకొనేవారు మాత్రం తమ వేలిపై ఉన్న సిరా గుర్తు మాత్రం చూపించాలి మరి..!


రాజధాని నగరంలో ప్రతి సంవత్సరం కూడా చాలా తక్కువగా ఓటింగ్ నమోదు అవుతుందని.. ఎందుచేతనో యువత ఓట్లు వేయడానికి ఇష్టపడడం లేదని.. ఆ పద్ధతిలో మార్పు తీసుకురావడం కోసమే తాను ఈ ప్రత్యేక ఆఫర్ పెట్టానని హోటల్ యజమాని అన్నారు. ఈ రోజు ఉదయమే కర్ణాటకలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. వివిధ ప్రముఖులు కూడా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వేశారు. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి 24 శాతం ఓటింగ్ పూర్తయ్యింది