జర్నలిజంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు వరం.. జీ మీడియా అందిస్తోన్న సర్టిఫికెట్ కోర్సు
జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా), జీ మీడియా కార్పొరేషన్ సంయుక్తంగా జర్నలిజంలో 9 నెలల సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నాయి. నోయిడా కేంద్రంగా ఈ కోర్సును నిర్వహించడం జరుగుతోంది. ఈ 9 నెలల కోర్సులో భాగంగా 3 నెలలు న్యూస్ రూమ్‌లో ఇంటర్న్‌షిప్‌ను కూడా జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా) అందిస్తోంది.
జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా), జీ మీడియా కార్పొరేషన్ సంయుక్తంగా జర్నలిజంలో 9 నెలల సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నాయి. నోయిడా కేంద్రంగా ఈ కోర్సును నిర్వహించడం జరుగుతోంది. ఈ 9 నెలల కోర్సులో భాగంగా 3 నెలలు న్యూస్ రూమ్‌లో ఇంటర్న్‌షిప్‌ను కూడా జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా) అందిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు స్టయిఫండ్ కూడా అందివ్వనున్నారు. ఈ కోర్సు ఫీజు నిమిత్తం ఎస్సెల్ ఫైనాన్స్ అందించే లోన్ సౌకర్యా్న్ని కూడా విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు.
ఈ కోర్సులో చేరాలని భావించే విద్యార్థులు తొలుత భాషా నైపుణ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఆంగ్లం, హిందీతో పాటు ఒక ప్రాంతీయ భాషలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే లైవ్ వీడియో ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జీ మీడియా/డీఎన్‌ఏకి చెందిన సీనియర్ ఎడిటర్ల ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ
ఇంటర్వ్యూలు పూర్తయ్యాక విద్యార్థులు కోర్సులో చేరి 9 నెలల ట్రైనింగ్ పూర్తిచేశాక.. జీ మీడియా/డీఎన్‌ఏ సంస్థలలో ఖాళీలను బట్టి ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది.
ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం జర్నలిజం విద్యార్థులకు మల్టీ ఫార్మాట్ విధానం ద్వారా బహు భాషల్లో నిపుణులైన పాత్రికేయులుగా తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా.. వారికి నూతన సాంకేతిక పద్ధతులను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి పద్ధతులను పరిచయం చేయడం కూడా. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు బోధన తరగతులను ప్రముఖ పాత్రికేయులు, పేరెన్నిక గల మీడియా నిపుణులు నిర్వహించడం జరుగుతుంది. నోయిడా కేంద్రంగా విద్యార్థులకు అందిస్తున్న ఈ కోర్సు.. ముంబయిలో కూడా నిర్వహించడానికి ప్రస్తుతం సంస్థ ఆలోచన చేస్తోంది.
ఈ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా జీ మీడియా కార్పొరేషన్ చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సునీల్ జోషి తన అభిప్రాయాలను పంచుకున్నారు. " ఈ కోర్సులో చేరే విద్యార్థుల ఎంపిక చాలా పకడ్బందీగా జరుగుతుంది. ముడి వజ్రాల వంటి విద్యార్థులను సానబెట్టిన వజ్రాలుగా మార్చడానికి చేసే ఈ ప్రయత్నంలో భాగంగా ముందు వారి నైపుణ్యాలు, ఆసక్తులను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తాం.
కొత్త తరానికి మల్టీ ఫార్మాట్ విధానం ద్వారా బహుభాషా నైపుణ్యం కలిగిన మంచి జర్నలిస్టులను పరిచయం చేయడమే మా లక్ష్యం. అందులో భాగంగానే ఎంతో అనుభవం కలిగిన పాత్రికేయుల సలహాలు, సూచనలతో పూర్తి ప్రాక్టికల్ విధానంతో ఈ కోర్సును నిర్వహించేందుకు శ్రీకారం చుట్టాం. ఈ క్రమంలో జీ మీడియా & డీఎన్‌ఏ సంస్థలు ఎప్పుడూ మంచి జర్నలిస్టులను తయారుచేయడం కోసం చేసే ప్రయత్నాలకు ఈ కోర్సు కూడా ఒక వాహకం లాంటిదే అని చెప్పవచ్చు"
ఈ కోర్సు చేయడానికి ఆసక్తి గల విద్యార్థులు yogesh.lad@zeemedia.esselgroup.com / diana.chettiar@dnaindia.net ఈమెయిల్స్‌లో సంప్రదించవచ్చు.
జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా)/జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ (జీకా) గురించి:
జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా) మరియు జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ (జీకా) సంస్థలు 12వ తరగతితో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు బ్రాడ్ కాస్ట్, ప్రింట్, డిజిటల్ జర్నలిజంతో పాటు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, వెబ్ డిజైనింగ్ రంగాలలో కూడా శిక్షణ ఇస్తున్నాయి. నేడు విద్యార్థులు కూడా తమ సృజనాత్మకతకు మరింత సానబట్టి.. మంచి ప్రొఫెషనల్స్‌గా తయారుచేసి ఉపాధి అవకాశాలు అందించే సంస్థల వైపే మొగ్గు చూపుతున్నారన్నది నిపుణుల అభిప్రాయం.
ఈ క్రమంలో మా సంస్థలు మీడియా గ్రాడ్యుయేట్స్‌కు మంచి అవకాశాలు కల్పించడంతో పాటు.. ఈ పోటీ వాతావరణంలో వారికి వార్తా రచన, వార్తల రిపోర్టింగ్, యాంకరింగ్, టీవీ న్యూస్ కెమెరా, డిజిటిల్ మీడియా అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా వారికి విద్యార్థులుగా ఉన్నప్పుడే మంచి పని అనుభవాన్ని కూడా అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.
జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా) గత 12 సంవత్సరాలుగా ఫిల్మ్, టెలివిజన్, జర్నలిజం (టీవీ, ప్రింట్, డిజిటల్) రంగాలలో కోర్సులను నిర్వహిస్తోంది. ఈ కోర్సుల కాల వ్యవధి 3 నెలల నుండి 12 నెలల వరకు ఉండడం గమనార్హం. ఈ కోర్సులలో చేరే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడంతో పాటు వారు కోర్సు పూర్తి చేయడం కోసం ప్రత్యేకంగా సంస్థ లోన్ సౌకర్యం కూడా కల్పిస్తోంది.
జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ (జీకా) సంస్థ కూడా భారతదేశంలోనే తొలి క్లాసికల్, డిజిటల్ యానిమేషన్ ట్రైనింగ్ అకాడమీగా పేరుగాంచింది. 2డీ, 3డీ యానిమేషన్ రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు గత 22 సంవత్సరాలుగా వివిధ యానిమేషన్ నిపుణులను తయారుచేసిన అత్యున్నత సంస్థగా పేరుగాంచింది. పూర్తిస్థాయి ప్రాక్టికల్ నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకొనేలా ఈ విద్యార్థులకు నిపుణులు శిక్షణ అందిస్తారు.
ఆర్ట్, డిజైన్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు యానిమేషన్, కంప్యూటర్ ఆధారిత డిజిటల్ యానిమేషన్ విధానాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే జీకా - స్కూల్ ఆఫ్ యానిమేషన్, జీకా - స్కూల్ ఆఫ్ డిజైన్ అనే రెండు విద్యాలయాలు కూడా విద్యార్థులు ప్రొఫెషనల్‌గా ఎదగడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
జీ లెర్న్ గురించి
జీ మీడియా సంస్థల అనుబంధ విభాగమైన జీ లెర్న్ మీడియా రంగానికి సంబంధించి నాణ్యమైన విద్యా బోధనను అందించడానికి ప్రయత్నిస్తోంది. మీడియా విద్యార్థులు తమ బలాలను సరైన రీతిలో బేరీజు వేసుకొని.. కెరీర్ ఎంచుకొనే దిశగా సంస్థ అనుబంధ వృత్తి విద్యా కేంద్రాల్లో వారికి శిక్షణ ఇచ్చేలా జీ మీడియా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా యువత కోసం నెలకొల్పబడిన రెండు వృత్తి విద్యా కేంద్రాలే జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ (జీమా) మరియు జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ (జీకా) సంస్థలు.