2 Best Ways For White Hair Solution: ప్రస్తుతం ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు రసాయనాలతో కూడిన కలర్స్‌ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌తో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆర్గానిక్‌ రంగులను వినియోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా తెల్ల జుట్టును నల్లగా చేసుకోవడానికి సహజమైన జుట్టు రంగుగా మెంతి ఆకులను కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టుకు మెంతి ఆకులను ఎలా వినియోగించాలో ఇప్పడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెంతి ఆకులతో ఇలా హెయిర్ కలర్‌ను తయారు చేయండి:
మెంతి ఆకుల నుంచి తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి రంగును తయారు చేయడానికి ముందుగా మెంతి ఆకులు శుభ్రం చేసి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని మిక్సీలో వేసుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి నూనెను కలపాలి. బాగా కలిపిన తర్వాత, ఈ పేస్ట్‌ను ఒక గంట పాటు అలాగే ఉంచాలి.


ఇలా జుట్టు అప్లై చేయండి:
తయారు చేసుకున్న మెంతి హెయిర్‌ మాస్క్‌ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసే ముందు, జుట్టుకు చిక్కు విప్పి, తల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. తర్వాత రెండు గంటలపాటు అలాగే ఉంచాలి. తద్వారా జుట్టుకు రంగు బాగా ఎక్కుతుంది. రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.


[[{"fid":"265192","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఎండు మెంతి ఆకులను హెన్నాలో కలిపి కూడా పట్టించవచ్చు:
ఎండిన మెంతి ఆకులను హెన్నాలో మిక్స్ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇదే మిశ్రమంలో కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత జుట్టుకు అప్లై చేసి ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇలా 2 గంటలు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలర్‌ చేసిన తర్వాత మరుసటి రోజు జుట్టుకు బాగా నూనె రాసుని షాంపూతో తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు.


Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!


Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook