5 Aloevera Facepacks: అలోవెరాతో ఈ 5 ఫేస్‌ప్యాకులు వేసుకోండి.. మీ ముఖం మిలామిలా మెరిసిపోతుంది..
5 Aloevera Facepacks: అలోవెరాలతో రకరకాల ఫేస్‌ప్యాకులు తయారు చేసుకుని ముఖానికి వేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది.. మెరిసిపోతుంది అలోవెరా లో ముఖానికి హైడ్రైటింగ్ ఇచ్చే గుణాలు ఉంటాయి.
5 Aloevera Facepacks: అలోవెరాలతో రకరకాల ఫేస్‌ప్యాకులు తయారు చేసుకుని ముఖానికి వేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది.. మెరిసిపోతుంది. అలోవెరా లో ముఖానికి హైడ్రైటింగ్ ఇచ్చే గుణాలు ఉంటాయి. ఇది అన్ని స్కిన్స్ రకాలకు సరిపోతుంది.ముఖ్యంగా కలబందలో విటమిన్స్, మినరల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మాన్ని పోషణను అందిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో చర్మం కూడా మంచిగా సాగుతుంది. మచ్చలేని ముఖం మీ సొంతం అవుతుంది.
యాక్నే, నల్లబడిన ముఖానికి కలబంద ఎంతో మంచిది ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చర్మంపై దురదను తగ్గిస్తుంది అలోవెరా ముఖానికి మాయిశ్చరైజింగ్ ఇచ్చి పునర్జీవనం అందిస్తుంది. తరచూ అలోవెరాను మీ ముఖ సౌందర్యంలో యాడ్ చేసుకోవాలి దీంతో ఐదు రకాల ఫేస్ ప్యాక్ లు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
రోజ్ వాటర్, కలబంద..
అలోవెరా, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ ముఖం కణాలు పునరుజ్జీవనం అందుతుంది. ఒక టేబుల్ స్పూన్ కలబందలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది ముఖానికి మెడ భాగంలో అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
నిమ్మకాయ, కలబంద..
నిమ్మకాయ, కలబంద రెండు మంచి క్లెన్సింగ్ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటాయి. ముఖం మీద డెడ్ స్కిన్ కణాలను తొలగించి ముఖంపై పేరుకున్న ట్యాన్ నివారించి కాంతివంతంగా చేస్తుంది. ఒక చెంచా కలబంద జెల్ వేసుకొని ముఖం మెడ భాగానికి అప్లై చేసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చల్లని నీటితో చేసుకుంటే సరిపోతుంది.
టీ ట్రీ ఆయిల్, అలోవెరా..
కలబంద, టీ ట్రీ ఆయిల్ ముఖంపై ఒక మ్యాజిక్ గ్లోని తీసుకొస్తాయి. ఇది ఆయిలీ స్కిన్ యాక్నే ఉన్నవాళ్ళకి మంచి రెమెడీ. సెబం ఉత్పత్తిని నివారించి చర్మం లో బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది.
ఇదీ చదవండి: మీరు బరువు తగ్గాలనుకున్నా? కాలేయం ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ డ్రింక్ తాగాల్సిందే..
తేనె, కలబంద..
ఎండకు ముఖం డిహైడ్రేట్ అవుతుంది. అలోవెరా, తేనె కలిపి ముఖానికి వేసుకుంటే ముఖానికి రంగు మెరుగుపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కలబందలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి ముఖానికి మెడ భాగంలో బాగా రుద్దుకోవాలి ఇది కూడా ఫేస్ కి చల్లదనాన్ని అందిస్తుంది.
ఇదీ చదవండి: టమోట ఫిష్.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..
కలబంద, విటమిన్ ఇ..
కలబందతో ముఖం మృదువుగా మారిపోతుంది. ఆ కలబంద విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం అందంగా మారిపోతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఈ టాబ్లెట్ను రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ లో వేసుకొని ముఖానికి మెడ భాగంలో అప్లై చేసుకుని అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter