COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


How To Get Rid Of Mental Problems: ఆఫీసుల్లో పనుల కారణంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. దీని కారణంగా చాలామందిలో ఆందోళన పెరిగి మానసిక, శారీరిక సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యల కారణంగా చాలామంది రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే మానసికంగా అనేక రకాల సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. తరచుగా ఒత్తిడి కారణంగా ఆందోళనకు గురయ్యే వారు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని సహజ సిద్ధమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు సూచించిన కొన్ని సూచనలు సలహాలు పాటించాలి. 


ఆరోగ్య నిపుణులు సూచించిన వివరాల ప్రకారం ప్రతిరోజు ఆందోళన, ఒత్తిడి సమస్యలకు గురయ్యేవారు క‌ర్క్యుమిన్ సమ్మేళనాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమ్మేళనాలు పసుపు నీటిలో అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తరచుగా ఆందోళన, ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపును కలుపుకొని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆహారాలు కూడా ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


అంతేకాకుండా మానసిక సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు అల్పాహారానికి ముందు వాల్నట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి కారణంగా డిప్రెషన్ సమస్యలు ఎదుర్కొనేవారు డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డైట్ లో భాగంగా చేపలు, ఆకుకూరలు, పచ్చి కూరగాయలతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని.. దీపికాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.


అంతేకాకుండా ప్రతిరోజు బి కాంప్లెక్స్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఆందోళన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట. ఈ బి కాంప్లెక్స్ అధిక పరిమాణంలో ఉండే ఖర్జూర పనులను ప్రతి రోజు తినడం వల్ల మెదడులోని కణాలు కూడా శుబ్రమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా త‌వుడును చపాతీ పిండిలో వినియోగించి తీసుకోవడం వల్ల కూడా శరీరంలోని బి కాంప్లెక్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆహార పదార్థాలను ఒకసారి ట్రై చేయండి.


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి