Anti Ageing Cream: 50 ఏళ్ల వయస్సులో కూడా యౌవనంగా కన్పించాలంటే ఈ క్రీమ్ వాడాల్సిందే, ఎలా తయారు చేయాలంటే
Anti Ageing Cream: అందం కోసం, నిత్య యౌవనం కోసం ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆధునిక జీవన విధానంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏజీయింగ్. అంటే వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు కన్పించడం. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా..
Anti Ageing Cream: ఏజీయింగ్ సమస్యను దూరం చేయడం అంత సులభమేం కాదు. వయస్సుతో పాటు వచ్చే వృద్ధాప్య లక్షణాలకు తోడు..తక్కువ వయస్సుకే వయసు మీదపడినట్టు కన్పించడం ఇటీవలి కాలంలో అధికమైంది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి, పని ఒత్తిడి, నిద్ర లేమి, కాలుష్యం ఇలా కారణాలు చాలానే ఉన్నాయి..
ప్రకృతిలో లభించే కొన్ని అద్భుతమైన పదార్ధాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 50 ఏళ్ల వయస్సు వచ్చినా నిత్య యౌవనంగా కన్పించవచ్చంటున్నారు. ఏజీయింగ్ సమస్యను అరికట్టేందుకు అల్లోవెరా నైట్ క్రీమ్ అద్భుతంగా పనిచేస్తుంది. తరచూ ఈ క్రీమ్ రాయడం వల్ల స్కిన్ టైట్‌గా ఉండటమే కాకుండా నిత్య యౌవనంగా కన్పిస్తారు. అంతేకాకుండా చర్మ నిగారింపు కూడా ఉంటుంది. అల్లోవెరాలో ఉండే అద్భుతమైన పోషకాలు చర్మానికి ప్రయోజనం కల్గిస్తాయి. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని అంతర్గతంగా నరిష్ చేస్తాయి. అల్లోవెరా పింపుల్స్ సమస్య దూరం చేయడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. అల్లోవెరా నైట్ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ క్రీమ్‌తో చర్మం టెక్స్చర్ మెరుగుపడుతుంది. దాంతోపాటు చర్మం వదులు తగ్గుతుంది. ఫలితంగా ఎప్పటికీ లేదా ఎక్కువకాలం యౌవనంగా కన్పిస్తారు. ఎందుకంటే అల్లోవెరా అంతర్గతంగా పనిచేస్తుంది.
అల్లోవెరా నైట్ క్రీమ్ తయారు చేసేందుకు రెండు చెంచాల గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్, రోజ్ వాటర్, అల్లోవెరా జెల్, బీస్ వ్యాక్స్ అవసరమౌతాయి.
నైట్ క్రీమ్ తయారు చేయాలంటే ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో రెండు చెంచాల గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ , కొద్దిగా బీస్ వ్యాక్స్ వేసి కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని బాయిల్ చేయాలి. కాస్సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఇందులో కొద్దిగా రోజ్ వాటర్, అల్లోవెరా జెల్ వేయాలి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతే అల్లోవెరా నైట్ క్రీమ్ తయారైనట్టే. గాలి చొరబడని కంటైనర్‌లో భద్రపర్చుకోవాలి. అవసరమైనప్పుడల్లా అంటే వారానికి కనీసం 2-3 సార్లు రాత్రి వేళ సాధారణ క్రీమ్‌లా ఉపయోగించాలి. 4 వారాల్లోనే ఫలితాలు కన్పిస్తాయి. యాంటీ ఏజీయింగ్ క్రీమ్‌గా అద్బుతంగా పనిచేస్తుంది.
Also read: Glowing skin Tips: మగువలు ఇష్టపడే ఆ పూలతో ఫేస్‌ప్యాక్, ఎప్పటికీ తరగని అందం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook