Apple For Weight Loss: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. భారత్‌లో ప్రతి నలుగురిలో ఇద్దరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.  లావుగా ఉండడం వల్ల కొంత మందిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ తగ్గిపోతున్నాయని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి. ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తలను వినియోగిస్తున్నారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఊబకాయం నుంచి విముక్తి పొందడానికి పోషక విలువలున్న పండ్లను ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా బాడీని దృఢంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ముఖ్యంగా యాపిల్‌ పండ్లను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి ఆపిల్ ప్రయోజనాలు:


ఆపిల్‌లో తక్కువ కేలరీల ఉంటాయి:


యాపిల్స్‌లో తక్కువ క్యాలరీల ఉంటాయి. కావున బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పెద్ద సైజు యాపిల్స్‌లో దాదాపు 225 గ్రాముల కేలరీలు ఉంటాయి. కావున దీనిని స్నాక్ డైట్‌లో చేర్చుకుంటే అనేక రకాల లాభాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు కూడా అదుపులో ఉంటుందని వారు భావిస్తున్నారు.


ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్:


ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పని చేస్తాయని ఇటీవలే నివేదికలు తెలిపాయి. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే పోషకాలను తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది బరువును అదుపులో ఉంచడమే కాకుండా.. ఆకలి కూడా తగ్గుతుందని వారు పేర్కొన్నారు.


ఆపిల్‌లో నీరు అధికంగా ఉంటుంది:


యాపిల్స్‌లో కూడా అధిక మొత్తంలో నీరు ఉంటుంది. యాపిల్స్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా బాడీ బరువును కూడా నియంత్రిస్తుంది.


బరువు తగ్గడానికి ఆపిల్ ఎలా తినాలి:


1. బరువు తగ్గడానికి యాపిల్‌ను ముక్కలుగా కట్‌ చేసి తీసుకోవాలి.
2. అంతేకాకుండా యాపిల్స్‌ని జ్యూస్‌లా కూడా తాగొచ్చు.
3. కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలను ఓట్స్‌లో వేసుకుని కూడా తినవచ్చు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


 


Also Read: Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!


Also Read:  Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి