Ashwagandha Benefits: యవ్వనంతోపాటు సంతానప్రాప్తిని కలిగించే ఒకే ఒక్క దివ్యౌషధం.. `అశ్వగంధ`!
Ashwagandha Benefits: అశ్వగంధ పురుషులకు దివ్యౌషధమనే చెప్పాలి. ఇది సంతానోత్పత్తిని కలిగిస్తుంది. అశ్వగంధ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Benefits Of Ashwagandha: అశ్వగంధ గురించి మీరు వినే వింటారు. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ మెుక్కను " king of Ayurveda" అంటారు. అశ్వగంధ శాస్త్రీయనామం విథానియా సోమ్నిఫెరా. ఈ ఫ్లాంట్ ను ఎన్నో రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారు. అశ్వగంధను తెలుగులో పెన్నేరుగడ్డ , పన్నీరు, పులివేంద్రం, వాజిగంధి అనీ పిలుస్తారు. కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఒక్క అశ్వగంధికే ఉందని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ మెుక్క ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. ఇది ఎన్నో రకాల శారీరక మరియు మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. అశ్వగంధ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
అశ్వగంధ ప్రయోజనాలు
1. అశ్వగంధ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మీ ఒత్తిడిని దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో నిద్రను ప్రేరేపించే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మీకు ప్రశాంతత లభిస్తుంది.
2. గ్యాస్ట్రిక్ అల్సర్‌లను తగ్గించడంలో అశ్వగంధ సహాయపడుతుందని పరిశోధనలలో తేలింది.
3. పురుషుల యెుక్క లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇది సూపర్ గా పనిచేస్తుంది.
4. అశ్వగంధ తీసుకోవడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. ఇది అథ్లెట్స్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది.
5. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి అశ్వగంధ ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
6. అశ్వగంధ మీ దృష్టిని మరియు ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది. అశ్వగంధ సప్లిమెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
7. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా బీపీ, డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.
8. అశ్వగంధ డాండ్రఫ్ ను తొలగించి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.
Also read: Purple Food Benefits: పర్పుల్ కలర్ పుడ్.. ఆరోగ్యం మెండు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook