Benefits Of Purple Fruits And Vegetables: బిజీ లైఫ్, మారిన జీవన శైలి కారణంగా మీరు అనేక రకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల బారిన పడతారు. ఇలాంటి సమయంలో మీరు మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పల్పర్ కలర్ పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఎటువంటి అనారోగ్య సమస్యలు చుట్టముట్టవు. రీసెంట్ రోజుల్లో పర్పుల్ కలర్ వెజిటేబుల్స్ మరియు పండ్లు పట్ల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పల్పర్ రంగు పుడ్ ను తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
పర్పుల్ కలర్ పుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
** మీరు ఎరుపు మరియు నారింజ రంగుల క్యారెట్‌లను చాలాసార్లు తింటూ ఉంటారు. అయితే మీరు పర్పుల్ క్యారెట్‌లను తినడం వల్ల ఆరోగ్యం మెరుగుడుతుంది. మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీకు ఎలాంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తవు.
** పర్పుల్ క్యాబేజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల ఇది శరీరంలో వాపును తగ్గించడమే కాకుండా మీరు అనేక రకాల క్యాన్సర్ల నుండి బయటపడతారు.
** ప్యాషన్ ఫ్రూట్ అనేది చాలా మందికి తెలియదు. దీని శాస్త్రీయ నామం Passiflora Edulis. దీని పైభాగం ఊదా రంగులో, లోపలి భాగం పసుపు రంగులో ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులను దూరం చేస్తుంది.
** బీట్ రూట్ హెల్తీ పుడ్. ఇందులో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిని తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బీట్ రూట్ ను జ్యూస్ లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకోవడం చాలా ప్రయోజనం కలుగుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Skin Care: క్లీన్ అండ్ గ్లోయింగ్ ఫేస్ కోసం.. రోజూ ఈ జ్యూస్ తాగండి చాలు..
Also Read: Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook