Avakaya Popu Rice Recipe: ఆవకాయ అంటే ఇష్టపడని వారు ఉంటారా? అందరూ ఎంతో ఇష్టంగా ప్రతి రోజు ఒక ముద్ద ఆవకాయ అన్నం తింటారు. అంతేకాకుండా దీనిని కొన్ని రాష్ట్రాల్లో ఇతర కూరగాయ కర్రీ తయారీలో కూడా వినియోగిస్తారు. అయితే చాలామంది ఆవకాయను వేసుకుని పోపు రైస్‌గా కూడా తయారు చేసుకుంటారు. ఇది నోటికి అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. అయితే ఈ రెసిపీని రెస్టారెంట్లలో ప్రధాన డిష్‌గా కూడా విక్రయిస్తున్నారు. దీనిని సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు:
మిగిలిపోయిన రైస్‌
ఆవకాయ (రుచికి తగినంత)
ఉల్లిపాయ (ముక్కలుగా తరిగిన)
కారం (రుచికి తగినంత)
కరివేపాకు
నూనె
ఉప్పు
కొద్దిగా పసుపు
పోపు దినుసులు


తయారీ విధానం:
ముందుగా ఈ ఆవకాయ పోపు రైస్‌ను తయారు చేసుకోవడానికి స్టౌవ్‌పై ఓ పెద్ద బౌల్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో నూనె వేసుకుని బాగా వేడి చేసుకోండి.
ఇలా బాగా వేడి చేసిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
ఆ తర్వాత అందులో ఆవకాయలోని పులుపు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
ఇలా అన్ని వేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం, పసుపు వేసి కలపండి.
ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని పాన్‌లో వేసి బాగా కలపండి.
ఆ తర్వాత కొత్తమీర, చివరగా కరివేపాకు వేసి కలపండి.
వేడి వేడిగా ఆవకాయ పోపు రైస్‌ను పెరుగు లేదా రాయితాలతో సర్వ్ చేసుకోండి.


చిట్కాలు:
ఆవకాయకు బదులుగా మామిడికాయ పచ్చడిని కూడా వేసుకుని ఈ పోపు రైస్‌ వేసకోవచ్చు..
దీని రుచిని పెంచుకోవడానికి ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు చికెన్‌ మసాలా కూడా వినియోగించవచ్చు.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.