Bad Food Combinations: ఆరోగ్య ప్రయోజనాలను శరీరానికి అందించేందుకు చాలా మంది ప్రజలు పచ్చి కూరగాయలతో సలాడ్ తీసుకుంటుంటారు. వీటిని కొంతమంది చాలా ఇష్టంగా తింటుంటారు. మరికొందరు ఫ్రూట్ సలాడ్ లను బాగా ఇష్టపడతారు. కానీ వెజిటబుల్ సలాడ్ తినేటప్పుడు కొన్ని కూరగాయలను కలిపి తినకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో టమోటాలు, దోసకాయలు కలిపి తింటే ఆరోగ్యం పాడవుతుందని చాలా మందికి తెలియదు. సాధారణంగా ప్రజలు సలాడ్ చేసేటప్పుడు కీర దోసకాయలు, టొమాటోలను కలిపి తింటారు. కానీ, అలా తినవడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


కీర దోసకాయ, టమోట కాంబినేషన్..


ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కీర దోసకాయ, టమోటాలను కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, వికారం, అలసట, అజీర్ణం వంటి సమస్యలకు ఆ కాంబినేషన్ దారితీస్తుంది. కాబట్టి కీర దోసకాయ, టమోటాలను కలిపి తినకూడదు. 


విరివిగా తినడం మేలు..


కీర దోసకాయలో పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. దోసకాయలోని విటమిన్ సి శోషణకు ఆటంకం కలిగిస్తుందని కూడా తేలింది. అందుచేత టొమాటోలు, దోసకాయలు కలిపి తినకపోవడమే మంచిది. అందుకే ఈ రెండు ఆహారాలను కలిపి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు వీటిని తినాలనుకుంటే విరివిగా తినడం మేలు.  


Also Read: Watermelon Seeds Benefits: పుచ్చకాయ విత్తనాలను పడేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలుసుకోండి!


Also Read: Hand Shivering Exercise: ఈ వ్యాయామాలతో చేతులు వణికే సమస్యను నివారించుకోవచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.