Basket Ball Benefits: బాస్కెట్‌ బాల్‌ ఆడటం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. దీంతో మన స్టామినా పెరుగుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఇది మంచి కార్డియోవాస్క్యూలర్‌ వర్కౌట్. నిరంతరం బాస్కెట్‌ బాల్ ఆడటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇది స్ట్రెస్‌ను తగ్గించి మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాదు బాస్కెట్‌ బాల్‌ ఆడటం వల్ల టీమ్‌ వర్క్‌ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. బాస్కెట్‌ బాల్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బలమైన ఎముకలు..
బాస్కెట్‌ బాల్ ఆడటం వల్ల ఎముక ఆరోగ్యానికి కూడా మంచిది. ఎముక సాంద్రత బలంగా మారుతుంది. కొత్త బోన్ టిష్యూ పెరగడానికి ప్రోత్సహిస్తుంది. కండరాలు, ఎముకలు దృఢంగా మారడానికి బాస్కెట్ బాల్ ఆట సహాయపడుతుందని ఎన్‌ఐహెచ్ నివేధిక తెలిపింది.


ఇమ్యూనిటీ పెంచుతుంది..
ఈ ఆట ఆడటం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు కూడా పెరుగుతాయి. బాస్కెట్‌ బాల్‌ ఆడిన వ్యక్తులకు డిప్రెషన్ సమస్యలు కూడా రావు, సోషల్‌ కనెక్షన్ పెరుగుతుంది. ఇతరులతో పోలిస్తే బాస్కెట్‌ బాల్‌ ఆడుతున్న వ్యక్తులకు ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది.


మానసిక ఆరోగ్యం..
బాస్కెట్‌ బాల్ ఆడుతున్న వ్యక్తులు ఫిజికల్‌గా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఇది ఏకాగ్రతతో ఆడాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. అంతే త్వరగా డిసిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి గ్రౌండ్‌లో ఈ ఆట ఆడేటప్పుడు యాక్టీవ్‌ గా ఉండాల్సింది. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.


ఇదీ చదవండి: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? రాత్రిపడుకునే ముందు ఈ ఒక్క డ్రింక్ తాగి చూడండి..


నియంత్రణ..
బాస్కెట్‌ బాల్‌ ఆడుతున్న వ్యక్తులకు డెడికేటేడ్‌ గా ఉండాలి. పోటీ తట్టుకునేలా ఉండాలి. క్రమశిక్షణ కీలకపాత్ర పోషిస్తుంది. ఎంతో ఫోకస్‌ తో ఈ బాస్కెట్‌ బాల్‌ ఆడాల్సి ఉంటుంది.


నమ్మకం..
బాస్కెట్ బాల్ ఆడుతున్న వ్యక్తులకు తమపై తమకు నమ్మకం పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. బాస్కెట్‌ బాల్ పిల్లలకు కూడా ఎంతో మంచిది. ఈ గేమ్ తో మన కండరాలు అభివృద్ధి చెందడంతోపాటు ఉల్లాసంగా ఉత్సహంగా కూడా ఉంటారు.


గుండె ఆరోగ్యం..
బాస్కెట్‌ బాల్ ఆడుతున్న వ్యక్తులకు స్ట్రోక్‌ సమస్య, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 


ఇదీ చదవండి: వేడివేడిగా గోంగూర చికెన్‌ ఇలా తయారుచేస్తే ఒక్కపూటకే గిన్నె ఖాళీ..


కేలరీలను కరిగిస్తుంది..
అధిక బరువుతో బాధపడుతున్న వారు అధిక కేలరీల వల్ల ఇలా జరుగుతుంది. బాస్కెట్‌ బాల్‌ ఆడటం వల్ల ఈ సమస్యలు రావు. ఎందుకంటే ఇది ఎయిరోబిక్ ఎక్సర్ సైజు చేసిన ఫలితాలను ఇస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter