Banana Leaves: అరటి ఆకులతో స్నానం..ఆరోగ్యానికి ఎంతో మేలు !
Banana Leaf Bath Benefits: ఆయుర్వేద వైద్యాలకు భారతదేశం పుట్టినిల్లు. ఆధునిక జీవనశైలిలో ఇంగ్లీష్ మందులకు అలవాట్ల పడిన మనం మన వైద్యాన్ని మర్చిపోతున్నాం. కానీ పూర్వకాలంలో చెట్ల నుంచి వచ్చిన వాటితోనే వ్యధులకు చెక్ పెట్టేవారు. వాటిలో అరటి చెట్టు ఒకటి. అరటి వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.
Banana Leaf Bath Benefits: అరటి పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అరటి పండు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా మలబద్దం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అయితే కేవలం పండు మాత్రమే కాకుండా అరటి ఆకు వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మన సంప్రదాయ పద్థతిలో అరటి చెట్టు ఆకుల్లో భోజనం చేస్తాము. ఇలా అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అరటి చెట్ల ఆకుల్లో ఆహారం తీసుకోవడం వల్ల విష పదార్థాల నుంచి కాపాడుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో భోజనం చేయడం వల్ల శరీరంకి మంచి పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అరటి ఆకులతో స్నానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని పరిశోధనలో తేలింది. అరటి ఆకులతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
అరటి ఆకుల తీసుకోవాలి. వీటిని ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి స్నానం చేయాలి. మీరు నడుముకి చిన్న టవల్ కట్టుకొని తలపై తడి టవల్ చుట్టుకోవాలి. ఆ తర్వాత అరటి ఆకులతో శరీరానికి ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే ముక్కు వద్ద కాస్త గ్యాప్ ఉంచుకోవాలి. ఒక చాప పరుచుకొని సూర్యుడు వేడి మనపై పడేలా అరటాకులు చుట్టుకుని అర్ధగంట అలాగే ఉండాలి.
అరటి ఆకుల స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. చర్మ ఆరోగ్యానికి మంచిది:
అరటి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై మంట, దద్దుర్లు, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతాయి.ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గడానికి సహాయపడతాయి.
2. జుట్టు ఆరోగ్యానికి మంచిది:
అరటి ఆకుల్లో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. చుండ్రు, తలలో దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి.
3. శరీరాన్ని చల్లబరుస్తుంది:
అరటి ఆకుల్లో ఉండే సహజమైన కూలింగ్ లక్షణాలు శరీరాన్ని చల్లబరుస్తాయి.వేసవిలో వేడిని తట్టుకోవడానికి సహాయపడతాయి.శరీరంలోని వేడిని బయటకు పంపి,చర్మంపై చల్లదనాన్ని అందిస్తాయి.
4. మానసిక ప్రశాంతత ఇస్తుంది:
అరటి ఆకుల్లో ఉండే సువాసన మానసిక ప్రశాంతత ఇస్తుంది.ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. మంచి నిద్రకు దోహదం చేస్తుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter