Belly Loss Tips: పొట్ట తగ్గించే ప్రయత్నంలో ఉన్నారా.. అయితే మీరు తినాల్సింది ఇవే..!
Weight Loss Diet : బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ తో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం అనే దాని మీదే మన బరువు తగ్గడం లేదా పెరగడం ఆధారపడి ఉంటుంది. అందుకే బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం సరైన ఆహారం తీసుకోవాలి.
Weight Loss Diet : బరువు తగ్గడానికి ముఖ్యంగా పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గించడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. పొట్ట తగ్గాలంటే ఎక్సర్సైజ్ తో పాటు ముఖ్యంగా గమనించాల్సింది మనం తీసుకునే ఆహారం గురించి. మనం ఎలాంటి ఆహారం తింటున్నాము, ఎలాంటి పానీయాలు తాగుతున్నాం అనేదానిమీద మన బరువు ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం తీసుకుంటే నాజూకైన నడుము మీ సొంతం అవుతుంది.
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ పేరుతోనే నూనె ఎక్కువగా ఉండే పూరీలు, బోండాలు, చపాతీలు వంటివి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఉదయం పూట మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. అందుకే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓట్స్ మన రక్తం లోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాకుండా ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. అయితే ఓట్స్ ని తీయగా తినాలి అనుకునే వారు చక్కెరకి బదులుగా ఏవైనా ఫ్రూట్స్ వేసుకొని తింటే బెల్లీ ఫ్యాట్ నుంచి దూరంగా ఉండొచ్చు.
ప్రోటీన్ అనగానే మనకి గుర్తొచ్చే మొదటి ఆహారం గుడ్డు. ముఖ్యంగా అందులోని తెల్ల సొన లో ఉండే పోషకాలు ఇంకెందులోనూ ఉండవు. విటమిన్ బి12, విటమిన్ డి, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి వంటి ఎన్నో పోషకాలు గుడ్డు తెల్లసొన లో దాగి ఉంటాయి. అవి మన బరువు తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. గుడ్డు తెల్లసొన మాత్రమే తినాలని గుర్తుంచుకోండి.
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా బాదంపప్పులో ఉండే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ లో మన శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరిగించగల శక్తి ఉంటుంది. రోజూ బాదం పప్పులు తినడం వల్ల మన శరీరంలో నీరు పేరుకుపోదు. అలానే ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు త్వరగా మాయమైపోతుంది. అంతే కాకుండా ఆపిల్ సైడర్ వెనిగర్ మన బ్లడ్ షుగర్ ని కూడా నియంత్రిస్తుంది.
ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. మెటబాలిజం రేట్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి పొట్ట కూడా తగ్గుతుంది.
సాయంత్రం పూట అప్పుడప్పుడూ ఆకలేస్తుంది. అలాంటి సమయంలో ఏదో ఒక చిరుతిళ్ళు తినే బదులు ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఫ్రూట్స్ లో చక్కెర, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆకలి తీరుతుంది, అలానే బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఆహారం విషయంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని పాటించటం వల్ల అనుకున్న దానికంటే వేగంగానే మన బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు.
Also Read: Yadadri Temple: యాదాద్రికి మరింత వైభవం.. తిరుమల స్థాయిలో భారీ ప్రణాళికలు
Also Read: Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook