Oat Meal: స్థూలకాయం ప్రస్తుత రోజుల్లో ప్రధాన సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంలో చాలామందిలో ఈ సమస్య సాధారణమైపోయింది. అత్యంత తక్కువ ఖర్చుతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వంటి కారణాలతో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బరువు తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఏదీ సరైన ఫలితాలివ్వదు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు అతి తక్కువ ఖర్చుతోనే సాధ్యమయ్యే ప్రక్రియ గురించి పరిశీలిద్దాం.


బరువు తగ్గించేందుకు ఓట్స్ అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు న్యూట్రిషియన్లు. ఓట్స్‌ను మీ రెగ్యులర్ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఓట్స్ వల్ల శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలన్నీ పుష్కలంగా అందుతాయి. దాంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఓట్స్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఓట్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. అతి తక్కువ ఖర్చులో అంటే కేవలం 2 వందల రూపాయలకే బరువు తగ్గించే ప్రక్రియ ఇది.


అన్నింటికంటే చవకైన, శక్తివంతమైన బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ మాత్రమే. ఓట్స్‌తో ఆరోగ్యకరమైన పదార్ధాలు చాలా చేయవచ్చు. ఓట్స్ స్మూదీ, మిల్క్‌షేక్, మసాలా ఓట్స్, ఓట్స్‌కేక్..ఇష్టమైనవి తయారు చేసుకుని తినవచ్చు. ఓట్స్ వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. 


గుండె సంబంధిత వ్యాధుల్నించి సంరక్షించుకోవాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి. ప్రతిరోజూ ఓట్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్ వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా స్ట్రోక్స్ వంటి సమస్యలు దూరమౌతాయి.


ఇక రోజూ ఆయిలీ పదార్ధాలు తీసుకునేవారికి టైప్ 2 డయాబెటిస్ ముప్పు ఎదురౌతోంది. వర్కవుట్స్ చేసేవారికి ఓట్స్ మంచి ఆహారం. ఎందుకంటే ఇందులో ఉండే పోషక పదార్ధాలు శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను పూర్తి చేస్తాయి. డయాబెటిస్ రోగులు ప్రతిరోజూ ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఓట్‌మీల్ వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి. ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్ తేనెతో కలిపి తీసుకోవాలి. చర్మ సంబంధిత సమస్యలు దూరమవడమే కాకుండా చర్మానికి నిగారింపు వస్తుంది. 


Also read: Digestion: అరటి పండు వల్ల శరీరానికి ఎన్ని లాభాలో తెలుసా.. మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలకు చెక్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook