ఆధునిక బిజీ ప్రపంచంలో వివిధ రకాల ఆహార పదార్ధాలు, పని ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి కారణాలతో డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. అటు మగవారికి ఇటు మహిళలకు ఇద్దరికీ ఎదురయ్యే సమస్యే అయినా..మహిళలకు మాత్రం మరింత ఇబ్బంది కల్గిస్తుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందం అనేది అందరికీ అవసరమే. కానీ ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా..సరైన ఆహారం, సరైన నిద్ర లేక కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య మహిళలకు తీవ్ర ఇబ్బందిగా పరిణమిస్తుంది. డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖం అంద విహీనంగా మారుతోంది. యుక్త వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. ముఖం కాంతిని కోల్పోయి..నిర్జీవంగా మారుతుంటుంది. కావల్సినంత నిద్ర లేకపోడవం, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, అలసట కారణంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతున్నాయి. 


డార్క్ సర్కిల్స్ ఎందుకు ఏర్పడతాయి


మనం తినే ఆహారంలో పోషక పదార్ధాలు లోపించడం, ధూమపానం, ఎండలకు ఎక్స్‌పోజ్ అవడం వల్ల చర్మం దెబ్బతినడం లేదా జీన్స్ కూడా కంటి కింద డార్క్ సర్కిల్స్‌కు కారణాలంటున్నారు. సీజన్ మారినప్పుడు తలెత్తే ఎలర్జిక్ రియాక్షన్లు, జలుబు, ముక్కు మూసుకుపోవడం వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. మరోవైపు గంటల కొద్దీ సమయం కంప్యూటర్ల ముందు, మొబైల్ ఫోన్లతో ఎక్కువసేపు గడపడం కూడా ఈ సమస్యకు కారణం.


డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సహజ సిద్ధమైన వస్తువులతో తయారైన ఔషధాన్ని వినియోగిస్తే అద్బుత ఫలితాలుంటాయి. 


మీ కంటి చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడితే..టీ బ్యాగ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం టీ తాగేసిన తరువాత ఆ టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ టీ బ్యాగ్ ను కళ్లపై, కంటి చుట్టూ పెట్టుకోవాలి. 15-20 నిమిషాలసేపు ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే కెఫీన్ నాళాలపై ప్రభావం చూపించి రక్త ప్రసరణను మెరుగుపర్చుతుంది. రోజూ రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. 


కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలకు మరో ఔషధం పాలు. పాలు చర్మాన్ని డీప్ క్లీన్ చేసి చర్మానికి నిగారింపును అందిస్తుంది. కోల్డ్ మిల్క్ ఈ చిట్కాకు అద్భుతంగా పనిచేస్తుంది. చల్లటి పాలతో చర్మంపై మస్సాజ్ చేస్తే మరింత మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల చర్మానికి నిగారింపు మెరుగౌతుంది. దీనికోసం  కోల్డ్ మిల్క్‌ను 2-3 స్పూన్స్ తీసుకుని కంటి కింద రాసి మాలిష్ చేయాలి. ఓ అరగంట తరువాత కాటన్‌తో క్లీన్ చేయాలి. 


అంతేకాదు..ప్రతిరోజూ 8 గంటల రాత్రి నిద్ర కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు కచ్చితంగా నిద్రపోయి..ఉదయం 6 గంటలకు లేచిపోవాలి. ఇలా ప్రతిరోజూ అలవాటు చేసుకుంటే డార్క్ సర్కిల్స్ పోతాయి.


Also read: Astro and Zodiac Sign Tips: పెళ్లికి ముందు జాతకంలో ఏం చూస్తారు. ఏ రాశికి ఏ రాశితో కుదురుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook