Best Places to celebrate new year in India: 2023 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ సంవత్సరంలో ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకుని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి అందరూ రెడీ అవుతున్నారు. న్యూయర్ వేడుకలను కొత్త ప్రదేశంలో చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగా ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వారి ప్లాన్ చేసుకుంటారు.  డిసెంబరు 31, న్యూయర్ వేడుకలు ఇండియాలో ఎక్కడ జరుపుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోవా


డిసెంబరు 31, న్యూఇయర్ చేసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది గోవానే. ఎంజాయ్ చేయాలనుకునేవారికి దీని కంటే బెటర్ ప్లేస్ అంటూ ఏది ఉండదు. చిల్ అవ్వడానికి బీచ్స్. క్యాసిన్సో, క్రూయిజ్ రైడ్స్, క్లబ్స్, బార్స్, కాన్సర్ట్స్ , గాలా డిన్నర్స్, స్పా, వాటర్ స్పోర్ట్స్, .. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. బాగా బీచ్, కాలుంగట్ బీచ్, ఆగోడా ఫోర్ట్, పంజిమ్ బీచ్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు.


మున్నార్


నేచర్ లవర్స్ కు కేరళలోని మున్నార్ మంచి ప్లేస్. ప్రశాంతంగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఇక్కడి ప్రకృతిలో నడుస్తూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. టీ ప్లాంటేషన్, ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ, బోటింగ్ ఇక్కడి ప్రత్యేకతలు. మున్నార్ కల్చర్ మిమ్మల్ని ఆకట్టుకుంటోంది.


హిమచల్ ప్రదేశ్


న్యూయర్ వేడుకలు చేసుకోవడానికి హిమచల్ ప్రదేశ్ లోని కులు మనాలి, సిమ్లా బెస్ట్ అప్షన్. ఇక్కడ డీజే నైట్ పార్టీస్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక్కడ పుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మంచు పడుతున్నప్పుడు చూస్తే ఆ థ్రిల్లే వేరప్పా. ట్రెక్కింగ్, పారా గ్లైడింగ్, రివర్ ర్యాప్టింగ్ వంటి యాడ్వెంచర్స్ చేయాలనుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.


గోకర్ణ


సౌత్ ఇండియన్స్ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి ఇది మంచి ప్లేస్. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మృదేశ్వర టెంపుల్, ఏనా గుహలు, వాటర్ స్పోర్ట్ టూరిస్టులకు మంచి థ్రిల్ ను ఇస్తాయి. అందమైన బీచ్ లు, వాటర్ ఫాల్స్ గోకర్ణ సొంతం. చిల్ అవ్వడానికి బార్స్, రిసార్ట్స్, రెస్టారంట్స్, స్పా సెంటర్స్ కూడా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో ట్రిప్ కంప్లీట్ అయిపోవాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.


షిల్లాంగ్


మేఘాలయ రాజధాని షిల్లాంగ్ న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడం మంచి అనుభూతిని ఇస్తుంది. కట్టిపడేసే ప్రకృతి, అందమైన జలపాతాలు, సరస్సులు మిమ్మల్నిని ఆకర్షిస్తాయి. ఇక్కడి ఆచార వ్యవహారాలు బాగుంటాయి. నేచర్ లో గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి.


Also Read: Good Luck Plants: ఈ అద్భుత మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. ప్రతిరోజూ డబ్బు వర్షమే..!


శ్రీనగర్


కాశ్మీర్ ను స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. సైట్ సియింగ్ కు శ్రీనగర్ మంచి లోకేషన్, ఇక్కడ ప్రదేశాలు మిమ్మల్ని వేరే లోకంలో తీసుకెళతాయి. ఎంజాయ్ చేయడానికి బార్లు, రెస్టారెంట్స్ ఉంటాయి. మంచులో ఆటలు ఆడాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి.


వయనాడ్


ఇది కేరళలో ఉంది. వాటర్ ఫాల్స్, నేచర్ లవర్స్ కు ఈ ఫ్లేస్ బాగుంటుంది. ఇక్కడ ఉండే బ్యూటిపుల్ లేక్స్, కేవ్స్, కాఫీ ప్లాంటెషన్స్ మిమ్మల్నిని ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్, జిప్ లైనింగ్ వంటి యాడ్వెంచర్స్ చేయడానికి మంచి ప్రదేశం. వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యూయరీలో సఫారీ అదిరిపోతుంది.


పాండిచ్చేరి


న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కు ఇది కూడా సూపర్ ప్లేస్ అనే చెప్పాలి. ఇక్కడ అంతా ఫ్రెంచ్ కల్చర్ ఉంటుంది. బసిలికా చర్చ్, పాండిచ్చేరి బొటానికల్ గార్డెన్స్, ఔస్టెరి సరస్సు, సెరెనిటీ బీచ్, కరైకల్ బీచ్ చూడాల్సిన ప్రదేశాలు. చిల్ అవ్వడానికి క్లబ్స్, బార్స్, రెస్టారెంట్స్ ఉండనే ఉన్నాయి. ఈ ట్రిప్ తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది.


Also Read: Healthy Mood: మూడ్ 24 గంటలు బాగుండాలంటే ఈ 5 సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి