Healthy Mood: మూడ్ 24 గంటలు బాగుండాలంటే ఈ 5 సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవల్సిందే

మనిషి ఏ పని సజావుగా చేయాలన్నా మూడ్ అనేది చాలా కీలకం. చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా పని తలపెట్టాలన్నా మూడ్‌పైనే ఆధారపడి ఉంటుంది. మూడ్ సరిగ్గా ఉండాలంటే తినే డైట్ కూడా కారణమౌతుంది. డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్‌మీటర్‌ను వేగవంతం చేసే ఆహార పదార్ధాలు తింటే మూడ్ బాగుంటుంది. ఎందుకంటే మనిషి మూడ్‌ను నియంత్రించేది ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్ మాత్రమే.

Healthy Mood: మనిషి ఏ పని సజావుగా చేయాలన్నా మూడ్ అనేది చాలా కీలకం. చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా పని తలపెట్టాలన్నా మూడ్‌పైనే ఆధారపడి ఉంటుంది. మూడ్ సరిగ్గా ఉండాలంటే తినే డైట్ కూడా కారణమౌతుంది. డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్‌మీటర్‌ను వేగవంతం చేసే ఆహార పదార్ధాలు తింటే మూడ్ బాగుంటుంది. ఎందుకంటే మనిషి మూడ్‌ను నియంత్రించేది ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్ మాత్రమే.

1 /5

తృణధాన్యాలు తృణధాన్యాల్లో ఫైబర్ కావల్సినంతగా ఉంటుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచే వివిధ కారకాల్లో ఫైబర్ కూడా ఒకటి. అందుకే రోజువారీ ఆహారంలో తృణధాన్యాలుంటే మూడ్ ఎప్పటికీ పాడు కాదు. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

2 /5

వాల్‌నట్స్ వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది. రోజూ తగిన పరిమాణంలో వాల్‌నట్స్ తినడం వల్ల మూడ్ ఎప్పుడూ సక్రమంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 

3 /5

పాలకూర పాలకూరలో విటమిన్ బి9 కావల్సినంత లభిస్తుంది. ఇది డోపమైన్ ఉత్పత్తిలో కీలక భూమిక వహిస్తుంది. రోజువారీ ఆహారంలో పాలకూర ఉంటే మూడ్ మెరుగుపడటమే కాకుండా ఒత్తిడి దూరమౌతుంది.

4 /5

డార్క్ చాకోలేట్ డార్క్ చాకోలేట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని డోపమైన్ లెవెల్స్‌ను పెంచడంతో దోహదం చేస్తాయి. పరిమిత మోతాదులో డార్క్ చాకోలేట్ తినేవారికి మూడ్ బాగుంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. 

5 /5

అవకాడో అవకాడోలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి డోపమైనన్ స్థాయిని పెంచడంలో దోహదపడతాయి. రోజూ క్రమ పద్ధతిలో అవకాడో తినే అలవాటుంటే వారిలో మూడ్ ఎప్పుడూ చెడిపోకుండా ఉంటుందంటారు.