Best Vitamins When for Get Pregnant: కొంత మంది స్త్రీలలో, ఇతర స్త్రీలతో పోలిస్తే ప్రెగ్నన్సీ పొందటం చాలా కష్టంగా ఉంటుంది. గర్భం దరించలేని స్త్రీలు, అదనపు సమయంతో పాటు, ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది మరియు ప్రెగ్నన్సీ సులభంగా పొందుటకు అందుబాటులో ఉన్న మార్గం- గర్భధారణను ప్రోత్సహించే విటమిన్ లను తీసుకోవటం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ది అమెరికన్ ప్రేగ్నన్సీ అసోసియేషన్" ప్రకారం, గర్భం ధరించాలనుకునే స్త్రీలు 3 నెలలు నుండి 1 సంవత్సరం ముందు నుండి ఆహార పదార్థాల సేకరణలో మార్పులను అనుసరించాలి. ఆరోగ్యకరమైన గర్భాన్ని ధరించటానికి తీసుకోవలసిన విటమిన్ ల గురించి ఇక్కడ విశదీకరించబడింది.


Also Read: Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??


విటమిన్ 'C'
గర్భధారణ శాతాన్ని పెంచే ఉపభాగాలలో ఇది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. "ఫర్టిలిటీ ఫ్యాక్టర్" ప్రకారం, విటమిన్ 'C' లోపం వలన పురుషులలో స్పెర్మ్ (శుక్రకణాలు) ఒక ముద్దలా మారతాయి, ఫలితంగా, సంతానోత్పత్తికి సమస్యలు కలుగుతాయి. విటమిన్ 'C' పురుషులలో చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. సిగరెట్ తాగేవారిలో కూడా సంతానోత్పత్తి సమస్యలు కలుగుతాయి ఎందుకంటే సిగరెట్ లో ఉండే రసాయనాలు పురుషులలో సంతానోత్పత్తిపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే విటమిన్ 'C' స్త్రీలలో రసాయనాలను తటస్థీకరించి గర్భధారణ సమస్యలను కలిగిన స్త్రీలలో మరియు అండోత్పత్తి సమస్యలను కలిగి ఉన్న స్త్రీలలో సంతానోత్పత్తిని ప్రేరేపిస్తాయి. 


విటమిన్ 'B'
విటమిన్ 'B' పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచటమే కాకుండా, జనన లోపాలను నివారించటమే కాకుండా, న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. న్యూరల్ ట్యూబ్ లోపాల వలన పిండాభివృద్ధి లోపాలు కలిగి, వెన్నెముక మరియు మెదడు అభివృద్దిలో లోపాలు కలుగుతాయి. విటమిన్ 'B12' పురుషులలో శుక్రకణాల (స్పెర్మ్) సంఖ్య తక్కువ ఉన్న వారి సమస్యలను తగ్గిస్తుంది మరియు విటమిన్'B6' స్త్రీలలో ఫలదీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ 'B6' కొవ్వు, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియలో సహాయపడుతుంది. స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు, విటమిన్ 'B6' తీసుకోవటం వలన పిండాభివృద్ధిని ప్రేరేపించి, శిశువు మెదడును అభివృద్ధిలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ విటమిన్ హోమ్సిక్నేస్స్ ను కూడా తగ్గిస్తుంది.


Also Read: Allegation on Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??


విటమిన్ 'E'
"మాయోక్లినిక్ డాట్ కాం" ప్రకారం, విటమిన్ 'E' స్త్రీ, పురుషులలో ఫలదీకరణను పెంచుతుంది. ముఖ్యంగా పురుషులకు చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. పురుషులలో శుక్రకణాల (స్పెర్మ్) సంఖ్య తక్కువ ఉండే సమస్యలను తగ్గిస్తుంది. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ జరిగిన స్త్రీ యొక్క భర్తకు విటమిన్ సంబంధిత ఉపభాగాలను ఇస్తారు. ఇలా ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ జరిగిన స్త్రీ యొక్క భర్త విటమిన్ 'E' ని అధికంగా తీసుకోవటం వలన ఫలదీకరణ జరిగే స్థాయిలు దాదాపు 10 శాతం అధికమవుతాయి. 


మీరు గర్భాన్ని ధరిచాలి అనుకుంటే, మీరు మీ భాగస్వామి ఇద్దరు ఈ పోషకాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలను తినాలి. ఆహార ప్రణాళిక సమతుల్య ఆహారాలను తప్పక కలిగి ఉండాలి. చాలా వరకు ప్రీ నేటల్ విటమిన్ లు 100 శాతం వరకు శరీరానికి కావాల్సిన పోషకాలను కలిగి ఉంటాయి. కానీ, ఉపభాగాలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించటం తప్పని సరి. వైద్యుడు సూచించిన మేరకు మాత్రమే ఉపభాగాలను తీసుకోవాలి. మితిమీరిన మోతాదులో విటమిన్ సేకరణ వలన గర్భాన్ని ధరించాలన్న మీ లక్ష్యానికి ఇబ్బంది కలగవచ్చు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి