Bitter Gourd Juice: ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అనే సంబంధం లేకుండా చాలామంది జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం మార్కెట్లో అధికంగా ఖర్చు చేస్తుంటారు. కానీ వీటి వల్ల ఎలాంటి లాభం ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడంలో కాకరకాయ రసం ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు సమస్యలకు మంచి మందు.  కాకరకాయ, లేదా బిట్టర్ గోర్డ్, తన చేదు రుచికి ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సమస్యలకు కూడా సహాయపడుతుంది. అయితే ఈ కాకరకాయ రసం, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అయితే జుట్టుకు ఎలా అప్లై చేయాలి..? అనేది తెలుసుకోండి.
 
చాలా మంది చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం కాలుష్యం, సంరక్షణ లేకపోవడం. చుండ్రను తగ్గించాడానికి ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. ముందుగా కొన్ని జీలకర్ర తీసుకొని పేస్ట్‌ చేసుకోవాలి. ఆ తరువాత కాకర జ్యూస్‌లో కలుపుకోవాలి. దీని జుట్టుకు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గుతుంది. 


జుట్టు ఎక్కువగా రాలుతుంటే ఈ చిట్కాను ట్రై చేయండి. ముందుగా కాకరకాయ జ్యూస్‌ తీసుకోవాలి. ఇందులోకి కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఆ తరువాత జుట్టుకు అప్లై చేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచి శుభ్రమైన నీటితో కడుగుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 


తెల్లజుట్టు సమస్యలతో బాధపడేవారు కారకాయ రసం ఉపయోగించడం చాలా మంచిది. ఇది మెలనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ముందుగా కుదుళ్ల నుంచి జుట్టు చివరి దాకా రసాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. 


పొడిబారిన జుట్టుకు కాకర రసం, పెరుగు ఎంతో సహాయపడుతుంది. ఇందులో నిమ్మరసం కూడా కలుపుకొని అప్లై చేసుకోవడం వల్ల పొడిబారిన జుట్టు మళ్ళీ మృదువుగా మారుతుంది. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. 


జుట్టు చివర్లు చిట్లితే జుట్టు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాకరకాయ రసంను తలకు అప్లై చేయడం చాలా మంచిది. వారంలో రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. 


గమనిక: మీరు ఏదైనా చిట్కాను ప్రయత్నించే ముందు నిపుణులు సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. 


Read more: Buttermilk Hidden Facts: రోజు మజ్జిగ తాగితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.