ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఏ వ్యాధి దరిచేరకుండా ఉంటుంది. బాడీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటే ఇది సాధ్యమే. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా, పటిష్టంగా ఉండాలి. కానీ నిర్ణీత వయస్సు దాటితే ఎముకలు బలహీనపడిపోతుంటాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించడం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరవైల్లో కూడా ఇరవై-ముప్పైలా స్ట్రాంగ్ గా కన్పించాలని అందరికీ ఉంటుంది. సాధ్యం కాదని నిరుత్సాహ పడుతుంటారు. కానీ ఇది పూర్తిగా సాధ్యమే. మెరుగైన ఆరోగ్యం కావాలంటే బాడీ ఫిట్‌నెస్ చాలా అవసరం. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ శరీరంలోని ఎముకలు బలహీనమౌతుంటాయి. దీనికి కారణం కాల్షియం లోపం. అందుకే కాల్షియం తగినంతగా లభించే పదార్ధాలు తరచూ తీసుకోవాలి. దీనివల్ల ఎముకలు బలంగా మారి..అరవైల్లో కూడా ఇరవైలా కన్పిస్తారు..


నువ్వులతో ఉపయోగాలు


ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండే నువ్వుల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. రోజూ వీటీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బాడీ పెయిన్స్ వంటివి దూరమౌతాయి.


నట్స్, అంజీరతో లాభాలు


నట్స్, అంజీరలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజువారీ డైట్‌లో వీటిని చేర్చితే మంచి ఫలితాలుంటాయి. ఆకుకూరల్లో చాలా పోషక పదార్ధాలుంటాయి. వీటివల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. తోటకూర, పాలకూరతో పాటు కాలిఫ్లవర్, బ్రోకలీ కూడా కీలకంగా ఉపయోగపడతాయి.


ఇక బీన్స్ వల్ల ఎముకలకు పటిష్టత వస్తుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్నాయి. బీన్స్‌ను మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే ఎముకలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ డైట్ తీసుకుంటే..మీ వయస్సు 60కు చేరినా ఎముకల్లో పటుత్వం తగ్గదు. బలంగా ఉండటమే కాకుండా అరవైల్లో సైతం ఇరవైలా కన్పిస్తారు. 


Also read: Health Benefits: రోజుకు మూడు రకాల స్ప్రౌట్స్..అన్ని రోగాలు మాయం, బాడీ ఫిట్ అండ్ హెల్తీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook