మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది బరువు పెరుగుతుంటారు. బరువు తగ్గడానికి చాలా మంది డైటింగ్ చేయడంప్రారంభిస్తారు. వరుసగా భోజనం చేయడం మానేస్తారు. అయితే ఇలా బరువు తగ్గాలని తినడం మానేయడం మంచిది కాదు. నిజానికి బరువు తగ్గడానికి సులువైన సూత్రం.. ఆరోగ్యకరమైన ( Health ) ఆహారం.. సరైన వ్యాయామం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యానికి రక్షా ఇస్తుంది ఉప్మా
ఉదయానే ఆల్పాహారం చాలా మంచిది. కానీ చాలా మంది బరువు పెరుగుతున్నాం అనే భయంతో.. డైటింగ్ చేయాలనే కోరికతో బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. కానీ లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో వెయిట్ లాస్ రెసెపీల ( Weight Loss Recipe ) డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే లైట్ బ్రేక్ ఫాస్ట్ ( 
Breakfast Recipe ) లో ఉప్మాపేరు ముందు ఉంటుంది. దీనిని తయారు చేయడానికి 20 నిమిషాలు సరిపోతుంది. దాంతో పాటు తక్కువ బడ్జెట్ తో దీన్ని తయారుచేయవచ్చు.



కావాల్సినవి


  • 2 కప్పుల ఉప్మా రవ్వ

  • అరకప్పు అవాలు

  • ఒక ఎండుమిర్చి

  • రెండు చెంచాల శనగపప్పు

  • 10-12 కరివేపాకు

  • పావు టీస్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి

  • పావు కప్పు సన్నగా తరిగిన క్యారెట్

  • పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్

  • ఒక ఉల్లిపాయ-సన్నగా తరిగినవి

  • పావు కప్పు మొక్కజొన్న గింజలు

  • రెండు కప్పుల నీరు

  • రెండు చెంచాల సన్నగా కోసిన కొత్తిమీర

  • Health: జీలకర్రతో ఆరోగ్యం మరింత పదిలం


ఇలా చేయాలి
1.రెండు మూడు నిమిషాలు ఉప్మా రవ్వను ఫ్రై చేయండి.
2. కడాయిలో నూనె పోసి వేడి చేయండి. ఇందులో ఆవాలు, కరివేపాకు,  ఎండు మిర్చి, శనగపప్పు వేయండి
3. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయించండి. అన్ని కూరగాయలు కలిసి రెండు నిమిషాలు సన్నని సెగపై ఉంచండి.
4. ఇందులో నీరు, ఉప్పు వేయండి.
5. ఉప్మా రవ్వ వేసి కలుపుతూ ఉండండి.
6. గ్యాస్ ఆఫ్ చేసి ఇందులో నిమ్మరసం కలపండి.
7. తరువాత కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేయండి.