Six pack Tips: నాలుగు వారాల్లో సిక్స్ ప్యాక్ కోసం పది ముఖ్యమైన సూచనలు
Six pack Tips: ఆధునిక జీవనశైలిలో హెల్త్ ఫ్యాషన్ సిక్స్‌ప్యాక్. భుజాల్నించి..రిబ్స్ వరకూ కన్పించే ఆరు ప్యాక్స్. అదే ప్యాషన్. అదే ఆరోగ్యం. ప్రతి ఒక్కరికీ ఇదే ఆలోచన. మరి సిక్స్‌ప్యాక్ కోసం పాటించాల్సిన పది ముఖ్యమైన సూచనలేంటో తెలుసుకుందాం..
Six pack Tips: ఆధునిక జీవనశైలిలో హెల్త్ ఫ్యాషన్ సిక్స్‌ప్యాక్. భుజాల్నించి..రిబ్స్ వరకూ కన్పించే ఆరు ప్యాక్స్. అదే ప్యాషన్. అదే ఆరోగ్యం. ప్రతి ఒక్కరికీ ఇదే ఆలోచన. మరి సిక్స్‌ప్యాక్ కోసం పాటించాల్సిన పది ముఖ్యమైన సూచనలేంటో తెలుసుకుందాం..
సరైన్ డైట్, సరైన సిక్స్‌ప్యాక్‌తో ఆరోగ్యంతో పాటు అందమైన బాడీని కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూట్రిషియన్లు, జిమ్ ట్రైనర్లు దీనికోసం పది సూచనలు ఇస్తున్నారు. ఈ పది సూచనలు పాటిస్తే..మీరు ఊహించినదానికంటే ఈజీ ఈ సిక్స్‌ప్యాక్. అది కూడా కేవలం నాలుగు వారాల్లో సిక్స్‌ప్యాక్ పొందవచ్చంటున్నారు. అంటే కేవలం ఓ నెల వ్యవధిలో సిక్స్‌ప్యాక్ సాధ్యమేనంటున్నారు.
1. రిఫైన్డ్ , ప్రోసెస్డ్ ఆహారాన్ని సాధ్యమైనంతవరకూ వదిలేయాలి.
2. ప్రతి మూడు గంటలకోసారి అంటే రోజుకు ఆరుసార్లు తినే అలవాటు చేసుకోవాలి.
3. ప్రతి భోజనంతోపాటు ప్రోటీన్ బేస్‌గా చేసుకోవాలి. గుడ్లు, చేపలు, చికెన్, మాంసం దీనికి ప్రత్యామ్నాయం
4. ప్రతి భోజనం మధ్య నట్స్, సీడ్స్, అవకాడో, ఓలివ్స్, స్నాప్ పీస్ తీసుకోవాలి.
5. బ్రేక్ ఫాస్ట్, రెండవ మీల్స్‌లో స్టార్చీ ఫుడ్ ఐటమ్స్ ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం ఓట్ మీల్, మొలకల బ్రెడ్, పండ్లు ఉండాలి.
6. ఇక భోజనం సమయంలో స్వీట్ లేదా బంగాళదుంప, బ్రౌన్ రైస్ మంచిది
7. సాయంత్రం భోజనంలో వెజిటేరియన్ ఉండాలి. కానీ స్టార్చీ ఫుడ్, వేరు ఆధారిత కూరగాయలకు దూరంగా ఉండాలి.
8. అమితంగా నీళ్లు తాగాలి
9. ప్రతి పదిరోజులకు కావల్సిది తినండి. దీనివల్ల బాడీ పటిష్టమౌతుంది.
10. ఫోస్ట్ వర్కవుట్ షేక్స్ తప్పకుండా తీసుకోవాలి. 40-50 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 20-30 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి.
ఇవి కాకుండా జిమ్ ట్రైనర్ చెప్పినట్టుగా తప్పకుండా రోజుకు రెండుసార్లు వర్కవుట్ క్రమబద్ధంగా చేయాలి. అది కూడా బాడీకు స్టెయిన్ లేకుండా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.
Also read: Neem Leaves Benefits: వేప ఆకుల వల్ల చర్మ సమస్యలు మటు మాయం.. క్రమం తప్పకుండా ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook