Neem Leaves Benefits: వేప ఆకుల వల్ల చర్మ సమస్యలు మటు మాయం.. క్రమం తప్పకుండా ఇలా చేయండి..!

Neem Leaves Benefits: వేప చాలా రకాల ఔషద గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. ఇది అనేక వ్యాధుల చికిత్స కోసం దివ్యౌషధంగా ఉపయోగిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2022, 05:04 PM IST
  • వేప ఆకులు చర్మ సమస్యల నుంచి రక్షిస్తుంది
  • మొటిమలను తొలగిపోతాయి
  • చర్మ వ్యాధులు దూరమవుతాయి
Neem Leaves Benefits: వేప ఆకుల వల్ల చర్మ సమస్యలు మటు మాయం.. క్రమం తప్పకుండా ఇలా చేయండి..!

Neem Leaves Benefits: వేప చాలా రకాల ఔషద గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. ఇది అనేక వ్యాధుల చికిత్స కోసం దివ్యౌషధంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీనిని చర్మ సంబంధిత సమస్యలకు కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని చర్మానికి సంబంధించిన సమస్యలకు వినియోగించడం వల్ల అనే రకాల వ్యాధులు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. వీటి వల్ల వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

స్కిన్ టోన్ కోసం:

 వేప ఆకుల పొడిని పచ్చి పాలతో కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. దీనిని ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్ర చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. చర్మం సహజమైన కాంతిని పొందుతుంది.

మొటిమలను తొలగిపోతాయి:

వేప ఆకుల సారం శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీని వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. తెల్లవారుజామున ఖాళీ కడుపుతో అర గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల వేప సారం వేసుకుని తాగాలి.

బ్లాక్ హెడ్స్,  వైట్ హెడ్స్:

ఒక చెంచా వేప ఆకు పొడిని తీసుకుని.. అందులో ఒక చెంచా శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ పుల్లని పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత తడి కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి.

చర్మ వ్యాధులు దూరమవుతాయి:

వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మీ చర్మాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. దీని కోసం వేప ఆకులను గ్రైండ్ చేసి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మచ్చలు తేలికగా మారడానికి:

10 తాజా వేప ఆకులను రోజ్ వాటర్‌తో గ్రైండ్ చేసి ముల్తానీ మిట్టిలో కలిపి అప్లై చేయాలి. ఇప్పుడు వృత్తాకారంలో మసాజ్ చేసి కడిగేయాలి. అంతే త్వరలోనే మచ్చలు తేలికగా మారుతాయి.

యాంటీ ఏజింగ్ కోసం:

వేప ఆకులను గ్రైండ్‌ చేసి ఆ మిశ్రమాన్ని, తాజా కలబంద జెల్‌ను మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను మీ చర్మంపై అప్లై చేయండి. 15 నిముషాల పాటు అలాగే ఉంచి.. చర్మానికి మసాజ్ చేస్తూ చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మంపై చర్మ వ్యాధులు దూరమవుతాయి.

Also Read: Tamarind leaves benefits: చింతపండు మాత్రమే కాదు..దాని ఆకులు కూడా జుట్టుకు వరం

Also Read: Milk Benefits At Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మర్చిపోకండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News