Calcium Rich Foods: శరీరంలో కాల్షియం కొరతగా ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది బాడీలో  పెద్ద పరిమాణంలో కనిపించే ఖనిజం. ఇది శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. ముఖ్యంగా ఎముకలు శక్తి వంతంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా  దంతాలు, కండరాలు దృఢంగా చేసేందుకు దోహదపడుతుంది. అయితే ఇది శరీర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇది అనేక రకాల ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. అయితే ఈ కింద పేర్కొన్న ఆహారలను తీసుకుంటే శరీరంలో ఇది కొరతగా ఉండదని వైద్య నిపుణులు డాక్టర్ ఆయుషి యాదవ్ ZEE NEWSకి తెలిపారు.
 
ఈ ఆహారాల్లో పుష్కలంగా  కాల్షియం లభిస్తుంది:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆకు కూరలు(Dark Green Leafy Vegetables):


సాధారణంగా మనం రోజూ తినే ఆహారంలో పచ్చి కూరగాయలను ఉండేట్టు చూసుకుంటాం.. ముఖ్యంగా మంచి ఆరోగ్యం కోసం బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలను తింటూ ఉంటారు. కానీ ఎముకలు, కండరాల బలానికి ఆకుకూరలను వినియోగించి సలాడ్ రూపంలో తినవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


టోఫు (Tofu) (జున్ను లాంటి పాల పదార్థం):


టోఫు అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్‌గా వైద్య నిపుణులు పరిగణించారు. అయితే పాలతో చేసిన జున్నులా కనిపించే ఈ ఆహారంలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. గుండె మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది.


గింజలు, విత్తనాలు(Nuts and Seeds):


బాదం, పిస్తాను సూపర్ రిచ్ కాల్షియం ఫుడ్‌గా పరిగణిస్తారు. రోజువారీ ఆహారంలో బాదం, విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గసగసాలు వంటి తీసుకుంటే శరీరంలో  కాల్షియం కొరత ఉండదు.


చేపలు(Fish):


 నాన్ వెజ్ డైట్ ద్వారా క్యాల్షియం తీసుకోవాలి అనుకునే వారు.. సాల్మన్ చేపలు, సార్డిన్ చేపలు తింటే ఎముకలు దృఢంగా మారి.. శరీరంలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.


బీన్స్(Beans):


బీన్స్‌ కూర అంటే అందరికీ ఇష్టమే.. క్రమం తప్పకుండా భారతీయులు తింటూ ఉంటారు. అయితే ఇందులో కూడా కాల్షియం అధిక పరిమాణం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!


Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook